వరంగల్

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అనుకున్న సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం వరంగల్ రూరల్ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయితీలో ఒక లక్ష మొక్కలను పెంచే విధంగా నర్సరీ ఉండాలని అన్నారు. ప్రతి స్కూల్లో విద్యార్ధులకు మొక్కలను ఇవ్వాలని సూచించారు. వాతవరణం భాగ అనుకులిస్తున్న కూడా మొక్కలను నాటడం ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను ప్రశ్నించారు. ఫారెస్ట్, అగ్రికల్చర్, ఎక్సైజ్ శాఖ వారు, ఎంపీడీవోలు హరితహార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అన్నారు. గత సంవత్సరం ఇచిచ్న లక్ష్యంకంటే ఎక్కువగా మొక్కలను నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ సంవత్సరం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్ధేశించారు. ఒక వేళ నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయలేక పోతే రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని అన్నారు. నర్సంపేటలో గ్రీన్‌ల్యాండ్ చాలా ఉందని, అందులో మొక్కలను పెంచావచ్చునని మున్సిపల్ కమీషనర్‌తో అన్నారు. ఒక వారంలో ఆటవీశాఖ వారికి ఉన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎపీవోలు సమన్వయంగా పనిచేస్తే వారికి ఉన్న లక్ష్యాన్ని పూర్తి చేయడం చాలా సులువ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో పురుషోత్తం, పీడీ,డిఆర్డీవో శేఖర్‌రెడ్డి, అగ్రికల్చర్ జెడి ఉషాదయాల్, ఎక్సైజ్ సుపరిటెండ్ శ్రీనివాస్‌రావు, పశుసంవర్ధక శాఖ జేడి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.