వరంగల్

కేసీఆర్ ఫ్లెక్సీలే పేదోడి ప్రహారీ గోడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 16: ఇళ్లు నిరుపేదకు కేసీఆర్‌ఫ్లెక్సీయే దిక్కైంది. ఇళ్లు నలుమూలాల ఫ్లెక్సీతో గోడలాగా నిర్మించుకొని అందుతో గత నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. వివరాలలోకి వెళితే... భీమదేవరపల్లి మండలం ముస్త్ఫాపూర్ గ్రామానికి చెందిన రొంటాల మలేశం-సుభధ్రలు ఉండేందుకు ఇళ్లు లేదూ...దీంతో తమకు ఉన్న కొద్దిపాట స్ధలంలో నాలువైపుల ఫ్లెక్సీలతో ప్రహరీ ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం భీమదేవరపల్లి మండలం ము స్త్ఫాపూర్ గ్రామానికి వచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిరుపేదల కుటుంబాలకు చెందిన అసంపూర్తిగా ఉన్న ఇళ్లను, ఇళ్లు లేని వారిని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో గతంలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరీ ఇవ్వక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు... అని కేసీఆర్ చాత కాని మాటలు మాట్లాడాడు.. ఇప్పు డు ఈ నిరుపేదలకు ఏమని సమాధానం చెప్తాడని ప్రశ్నించారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకుండా తెలంగాణ సర్కార్ దగా చేస్తున్నదని దుయ్యబట్టారు. గతంలో సిపి ఐ ఎమ్మెల్యేలు ప్రతిరోజు అసెంబ్లీ సమావేశంలో ప్రతి రోజూ నిరుపేదల గురించి మాట్లాడే వారిమని, నేడు ధనిక వర్గాలకు చెందిన వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా పనిచేయడం వల్ల వారికి పేదల సమస్యలు పట్టవని దుయ్యబట్టారు, అసెంబ్లీ సమావేశంలో నిరుపేదలకు దక్కాల్సిన వాటాపై ధ్వజమెత్తాల్సిన సమయం
ఆసన్నమైందన్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో మొత్తం నిరుపేదలు ఎంతమందికి ఇళ్లు లేవూ.. వారి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ ల వద్దకు వెళ్లి వారిగోడు వారితోనే వినిపిస్తామన్నారు. నిరుపేదల ఇళ్లను పరిశీలించిన వారిలో సి పి ఐ నాయకులు మార్పక అనిల్, కర్రె బిక్షపతి, ఆదరి శ్రీనివాస్, జుర్రు సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.