వరంగల్

కురవిలో కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, ఆగస్టు 17: కురవి పేరెన్నికగల పుణ్యక్షేత్రం.. ప్రజలకు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమని అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. కురవి మండల కేంద్రంలో మహబూబాబాద్ డిఎస్పీ నరేష్‌నాయక్ ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు ఏడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం తెల్లవారుజామున ముందుగా కురవికి వచ్చే రహాదారులను దిగ్భందం చేశారు. అనంతరం ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో 7 లక్షల నగదు, పత్రాలు సరిగా లేని 37 ద్విచక్రవాహానాలను, 3 కంప్రేషర్ ట్రాక్టర్లను, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు 20వేల విలువైన మద్యం, నాలుగు క్వింటాళ్ల బెల్లం, 2000లీటర్ల బెల్లం పానకం, 10లీటర్ల గుడుంబా, రెండు వేల విలువైన గుట్కా, అనుమతి లేని టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్‌లో డిఎస్పీ, ఎడుగురు సీఐలు, 12మంది ఎస్సైలు, 55మంది పీసీలు, 12 ఉమెన్ పీసీలు, 12మంది హోం గార్డులు, అదనపు బలగాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ... ఆధ్యాత్మిక ప్రదేశాలలో సుదూర ప్రాంతాలనుండి భక్తులు వస్తుంటారని, వారి భద్రతతో పాటు ఈ ప్రాంత ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమన్నారు. ఈ ప్రాంతం మీదని ప్రజలను ఉద్ధేశించి అంటూ తమ ప్రాం తాన్ని ఎవరైన ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోవద్దన్నారు. తెల్లవారుజామున నుండి కురవి కార్డన్ అండ్ సర్చ్‌లో 120 మంది పోలీసులు పాల్గొన్నారు. వారందరికీ శాఖ తరుపున కృతజ్ఞత లు తెలిపారు. ప్రజలకు సేవలందించాలనే ఉద్ధేశ్యంతోనే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ముత్తిలింగం గౌడ్, మరిపెడ సీఐ శ్రీనివాస్‌నాయక్, కురవి ఎస్సై నాగభూషణం, సీరోలు ఎస్సై రాణాప్రతాప్, రమేష్‌బాబు, తాహెర్‌బాబాలతో పాటు సీఐలు, ఎస్సైలు, ఎఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.