వరంగల్

గోదావరి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, ఆగస్టు 17: నాలుగు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం గోదావ రి నది పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఎల్లంపల్లి పైన ఉన్న జలాశయా లు నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తివేయ డం వల్ల గోదావరి నది నిండుకుండలా ప్రవహిస్తోం ది. శుక్రవారం కలెక్టర్ అమయ్ కుమార్ కాళేశ్వరం వద్ద గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 10.20 మీటర్ల మేర ఉందని, వరద తాకిడితో క్రమేపి గోదావరి నది నీటిమట్టం పెరుగుతుందని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మహాదేవపూర్ మండలంతో పాటు పలిమెల మండలంలోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. పలిమెల మండలంలోని రాళ్ల వాగు వరద ఉధృతిని అధికారులతో కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా రెండు మండలాల్లోని చెరువులు, కుంటలు నిండి పలు చెరువులకు గండ్లు పడడంతో వరద నీటితో పంట పొలాలు నీటి మునిగిపోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని గోదావరి నదికి పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులను అధికారులు నిలిపివేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌డిఓ వీరబ్రహ్మయ్య, మహాదేవపూర్ తహశీల్దార్ శ్రీనివాస రావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
సహాయ చర్యలు చేపడతాం: ఓఎస్‌డీ
భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో జయశంకర్ జిల్లాలోని లోతట్టు మండలాలైన మహాదేవపూర్, పలిమెల మారుమూల మండలాల్లో సహాయక చర్యలు చేపడుతామని భూపాలపల్లి జిల్లా ఓఎస్‌డీ సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నదివైపు ఎవరు వెళ్లవద్దని ఆయన కోరారు. ప్రాణనష్టం జరుగకుండా రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. పుష్కరఘాట్‌ల వద్ద పోలీస్ బలగాలతో పాటు గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఆయన వెంట డిఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద రావు, మహాదేవపూర్ సిఐ రంజిత్ కుమార్, కాళేశ్వరం ఎస్‌ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.