వరంగల్

నేటినుంచి రెండవ విడత వెబ్ అప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 17: 2018-19 విద్యాసంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌనె్సలింగ్ ఈ నెల 18వ తేదీనుండి 20వ తేదీవరకు నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ దేవులపల్లి ప్రవీణ్ తెలిపారు. 18వ తేదీ ఉదయం 8గంటలనుండి 20వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభ్యర్థులు వెబ్ అప్షన్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రత్యే క కేటగిరికి క్యాప్, ఆర్మీ అభ్యర్థులకు కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయా కేటగిరీలలో అర్హులు వెబ్ అప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 6వ తేదీన యూనివర్సిటీలో పొందు పరిచిన ప్రాధాన్యత క్రమంలో కళాశాలల అప్షన్లు ఇవ్వాలని తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కెఎన్‌ఆర్‌యుఎస్. ఇన్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.

19న బీసీల రాజకీయ చైతన్యయాత్ర
నర్సంపేట, ఆగస్టు 17: నర్సంపేట పట్టణానికి ఈనెల 19న బీసీల రాజకీయ చైతన్యయాత్ర చేరుకుంటుందని, ఈ క్రమంలో యాత్రకు బీసీలు పెద్ద సంఖ్య లో ఎదురేగి ఘన స్వాగతం పలకాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి డ్యాగల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీసీ రాజకీయ చైతన్యయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం (నేడు) నర్సంపేటలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారని వివరించరారు. ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్, సాగర్, సాంబరాతి మల్లేశం, రమేష్, రాచకట్ల రవి, ఆవుల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలపాలపై పీడీయాక్ట్: సీపీ రవీందర్
పరకాల, ఆగస్టు 17: పోలీసులపై ప్రజలకు నమ్మ కం కలిగేలా విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం పరకాల పోలీస్‌స్టేషన్‌ను కమిషనర్ రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ కిట్లను పరిశీలించారు. పరకాల పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో నెలకోల్పబడిన సీసీ కెమెరాల పని తీరును, నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. ప్రజల భద్రతకు 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసి న బ్లూ కోల్ట్స్ విభాగం పని తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ ప్రజల రక్షణకు పెట్రోలింగ్ నిర్వాహణ ద్వారా నేరాలను నియంత్రించగలమని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కేబుల్ ఆపరేటర్, సీసీ కెమెరాల టెక్నిషన్, సంబందిత పోలీస్ అధికారి సమన్వయంతో పని చేస్తూ సీసీ కెమెరాల పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పోలీసు అధికారులు సం దర్శించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశే్లషణ నిర్వహించడంతో పాటు అవసరమైన చోట్ల సూచికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం రోడ్డు స్టాప్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసుల విధులను వర్తికల్స్‌గా విభజించడం జరిగిందని, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీస్ అధికారి నియమించి వారి ద్వారా వారికి అప్పగించిన పనుల్లో రాణించడం జరుగుతుందని, ముఖ్యంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినం గా వ్యవహరించడం జరుగుతుందన్నారు. అదే పనిగా చట్టవ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు శాఖ పరమైన సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారం చేస్తానని తెలిపారు. అనంతరం మాతృశ్రీ విద్యార్థులతో కలిసి ఆయన పోలీస్ స్టేషన్‌లో పండ్ల మొక్కలను నాటారు. సీపీ వెంట పోలీసు అధికారులు పాల్గొన్నారు.