వరంగల్

చెరువుల పునరుథ్ధరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, జనవరి 2: చెరువుల పునరుద్ధరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టరు తాటికొండ రాజయ్య అన్నారు. మిషన్ కాకతీయ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాటికొండ వల్లభురాయిని చెరువులో పూడిక తీత పనులను ఎమ్మెల్యే రాజయ్య శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణతోనే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టిందన్నారు. వల్లభురాయిని చెరువులో పూడికతీత పనులకు ప్రభుత్వం రూ. 42.09 లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. చెరువు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలందరు సహకరించి పూర్వ వైభవం తెచ్చే విధంగా కృషి చేయలన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకంతో చెరువులల్లో నీటిమట్టం అడుగంటి పోయి, రైతులకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. చెరువులల్లో పూడిక తీయడంతో పాటు, తీసిన మట్టిని వ్యవసాయ పంటపొలాల్లో వాడుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గి స్తే భూసారం పెరగడంతో వ్యవసాయ రైతాంగానికి ఆదాయం పెరిగి పెట్టుబడులు వస్తాయన్నారు. ఆయకట్టు రైతులు,గ్రామప్రజల కోరిక మేరకు మల్లన్నగండి రిజర్వాయర్ నుండి నేరుగా తాటికొండ చెరువుకు సాగునీటిని అందించేందుకు కుడికాల్వ నిర్మాణానికి నిధులు తెచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.మిషన్ కాకతీయ కార్యక్రమంతో పాటు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సానాది సంధ్యారాజు, ఎంపిటిసి అకినెపల్లి బాలరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మెన్ గట్టు రమేశ్, నీటి పారుదల శాఖ డిఇ హరిప్రసాదు, ఏఈ రాము, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు ఇషాక్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు , కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.