వరంగల్

గిరిజన విద్యార్థినీల మృతిపై సిట్టింగ్‌జడ్జిచే విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతగిరి, జనవరి 2: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి అడవుల్లో ఇటీవల అనుమానస్పద స్థితిలో మృతి చెందిన గిరిజన విద్యార్థుల మృతిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టిటిడిపి శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పర్వతగిరి మండలం కంబాలకుంటతండాకు చేరుకున్న ఆయన మృతి చెందిన విద్యార్థినీల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు వెంటనే పది లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సిట్టింగ్‌జడ్జితో న్యాయవిచారణ జరిపించాలన్నారు. దోషులను గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఏసి ఎస్ వైస్ చైర్మన్ రాజు, ఎస్టీ సెల్ మండల నాయకులు శ్రీనివాస్, సీతారాంనాయక్, నాయకులు గంగాధర్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో
గిరిజన శాఖ డిడి తనిఖీ
కురవి, జనవరి 2: కురవి మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలను ట్రైబల్ వెల్‌ఫర్ డిడి పోచం శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విద్యార్థినీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో విద్యార్థినీలకు సరిపడ భవనాలు లేవని, త్వరలోనే నూతన భవనాలను మంజూరు చేయడం జరుగుతుందని పోచం హామీ ఇచ్చారు. నూతనంగా మండల కేంద్రంలో నిర్మించిన పిహెచ్‌సి పక్కన స్థలాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఉన్న నీటి సమస్యను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని పోచం తెలిపారు. పాఠశాల తనిఖీ వచ్చిన పోచంకు సమస్యలు పరిష్కరించాలని నంగారభేరి డివిజన్ అధ్యక్షుడు తేజావత్ రవి, జిల్లా కార్యదర్శి బోడ సేవ్యానాయక్‌లతో పాటు మరికొందరు వినతి పత్రం అందజేశారు.