వరంగల్

ఆదివాసీలకే నామినేటెడ్ పదవులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, మే 6: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేపట్టబోయే నామినేటెడ్ పదవులను ఏజన్సీ ప్రాంతాల ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు కొమరం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసంఘ కార్యకర్తల సమావేశానికి హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ ఏజన్సీప్రాంత ఆదివాసీలు రాజకీయ ప్రాతినిధ్యం లేక అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని మార్కెట్ కమిటీలు, గిరిజన సహకార సంస్ధలు, ట్రైకార్ సంస్ధలలో ఛైర్మన్, డైరెక్టర్ల పదవులను ఆదివాసీలకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు తెలంగాణ రాష్టస్రమితి జిల్లా నాయకత్వం సహకరించాలన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అడ్వయిజర్ పొడెం రత్నం, ఆదివాసి గిరిజనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దబోయిన రవి, నాయకపోడు సేవాసంఘం జిల్లా నాయకులు ఆవుల ఆదినారాయణ, భద్రయ్య, భూపోరాట కమిటి అధ్యక్షుడు పొడుగు రామారావు, ఆదివాసి విద్యార్ధిసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏంపల్లి సతీష్ పాల్గొన్నారు.