వరంగల్

మహాకూటమిదే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 23: రాబోయె ఎన్నికల్లో మహాకూటమి గెలుపుఖాయమని, కేసీఆర్‌ను గద్దె దించడమే మహాకూటమి లక్ష్యమని వరంగల్ రూరల్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో టీడీపీ మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు 60 నెల లు పరిపాలించాలని కేసిఆర్‌కు పరిపాలన అప్పగిస్తే పరిపాలన చేయలేక చేతులు ఎత్తేసి ముందస్తుగా వచ్చిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మహాకూటమితో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని తెలిపారు. మహాకూటమి ఏర్పడిన తరువాత కేసీఆర్ సర్వే చేస్తే టీఆర్‌ఎస్ పార్టీకి కనీసం 29 సీట్లు కూడా రావని తెలియడంతో మహాకూటమి దెబ్బతియాలని ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి రాకపోతే ఓట్లు అడగను అన్న కేసీఆర్ ఏ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు తీసుక వచ్చా వో చూపించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏవని, ఇంటి కో ఉద్యోగం ఏదని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ సామాజిక వర్గానికి న్యాయం చేసిన దాఖాలాలు లేవని చెప్పారు. స్థానికేతరుడైన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీ బిక్షతో ఎమ్మెల్యేగా గెలుపొందాడని చెప్పారు. స్థానికేతరుడైన చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. వాపును చూసి బలుపు అంటున్న చల్లా ధర్మారెడ్డికి ఓటమి తప్పదని పేర్కొన్నారు. చల్లా ధర్మారెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసిన తెరాసను వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రాజేశ్వర్‌రావు, రవీందర్, నారాయణదాసు, రజనీకాంత్, ప్రకాశ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం
* మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, సెప్టెంబర్ 23: ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సంక్షేమం సాధ్యమని ఏ ఐసీసీ సభ్యుడు, నర్సంపేట తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేట మండలంలోని మాధన్నపేటకుకు చెందిన వంద టీఆర్‌ఎస్, టీడీపీ కుటుంభాలు ఆదివారం దొంతి సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈసందర్భంగా దొంతి మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. మరో తొమ్మిది నెలల పాటు ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పరిపాలన చేతకాకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూంలు, దళితులకు మూడు ఎకరాల సాగుభూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితర హామీలను నామమాత్రంగానే అమలు చేశారే తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. కేసీఆర్, పెద్దిలు అసత్య ప్రచారం, బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. పల్లె ప్రగతి హామీల అమలు ఎక్కడ అమలుకు నోచుకున్నాయో ప్రజలంతా పెద్దిని నిలదీయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నర్సంపేట జడ్పీటీసీ అజ్మీరా పద్మా మేఘ్యానాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్‌నాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.