వరంగల్

సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసగించిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈగ మల్లేశం అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలను పక్కన బెట్టి వారికి కనీస గుర్తింపులేకుండా చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు. వేల కోట్ల రూపాయలను అభివృద్ధి పేరిట దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తులు అపవి త్రం అంటున్న తెరాస నాయకులు దర్మార్గపు పాలన కొనసాగిస్తే అందరం కలిసి మహాకూటమిగా ఏర్పడి ఆ పాలనను అంతమోందించాడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒనమాలు నేర్చుకున్న వారే నేడు తెరాసలో ఉండి టీడీపీని విమర్శించడం కన్నతల్లి పాలు తాగి కన్న తల్లినే విమర్శంచడం ఎంత వరకు సమంజసం అన్నారు. అలాంటి కుతంత్రాలకు టీడీపీ బయపడదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెరాస పార్టీలో విబేదాలు వచ్చాయని వారు కేటాయించిన అభ్యర్ధుల విషయంలో ప్రజలు విముఖత చూపిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని అని టీడీపీ హాయంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు పోయిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వచ్చే ఎన్నికలలో మహాకూటమి విజయం ఖాయం అని అన్నారు. నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని పొత్తులో భాగంగా వర్ధన్నపేట సీటును టీడీపీకి కేటాయించాలని తాము కోరామన్నారు. ఎవరికి ఏ సీటు వచ్చిన అంతిమంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమోందించాలన్నారు. వర్ధన్నపేట తెరాస అభ్యర్ధి ఆరూరి రమేష్ ఒక కాంట్రాక్టర్ అని బినామీ పేరుతో కోట్ల రూపాయలు కాజేసారన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం సీటును టీడీపీ కేటాయించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు సిలువేరు కుమారస్వామి, నాయకులు కతూరుస్వామి, తుమ్మల యాకయ్య పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాములు
నర్సంపేట, సెప్టెంబర్ 23: భౌగోళిక తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తే తప్ప సాధ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.రాములు అన్నారు. సీపీఎం రూరల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెద్దారపురమేష్, భూక్య సమ్మయ్యల అధ్యక్షతన ఆదివారం నర్సంపేట పట్టణంలోని రామక్రిష్ణ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాములు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం రద్దు చేసి ప్రజలు ఐదేండ్ల కోసం ఇచ్చిన అవకాశాన్ని అపహస్యం పాలు చేశారని అన్నారు. స్వరాష్ట్రం పోరాడి సాధించినా ఇప్పటి వరకు బడుగు, బలహీన వర్గాలకు జరిగింది శూన్యమని స్పష్టం చేశారు. పైగా కొత్తగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. బడ్జెట్‌లో అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ఖర్చు చేశామని చెబుతున్నా అంతా అవినీతే తప్ప ప్రజల అభివృద్ది శూన్యమని వాపోయారు. మళ్లీ అదే మ్యానిఫెస్టోతో ముందుకు వస్తున్నారని, మరోసారి మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమం లో రాష్ట్రంలో ప్రత్యామ్నయం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమేనని, అన్ని స్థానాలలో బీఎల్‌ఎఫ్ పోటీ చేస్తుందని, ప్రజల ఆధరించి గెలిపించాల్సిందిగా కోరారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈసమావేశంలో సీపీఎం రూరల్ జిల్లా కార్యదర్శి చింతమళ్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కోరబోయిన కుమారస్వామి, నమిండ్ల స్వామి, ఈసంపెల్లి బాబు, ఈదునూరి వెంకన్న, ఆకుల రుద్రప్రసాద్, హన్మకొండ శ్రీ్ధర్, వంగాల రాగసుధ, అనంతగిరి రవి, ముంజాల సాయిలు, కడియాల వీరాచారి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే
* మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య
కేసముద్రం, సెప్టెంబర్ 23: టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీయేనని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య అన్నారు. కేసముద్రం మం డల కేంద్రంలో ఆదివారం మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ప్రధాని నరేంద్రమోదీ పాలన పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారు. త్రిపురలో రెండుశాతం ఉన్న బీజేపీ అధికారం చేపట్టిందని, అదే తరహాలో తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో కూడా తమ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో నూతన ఓటరు నమోదుతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాటుపడాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్త్రుత ప్రచారం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నందకుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రామచెందర్‌రావు, నేతాజీ, మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.