వరంగల్

ఉమ్మడి ఎజెండాతోనే ఎన్నికలకు మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యం
* నిజాం కాలంనాటి ‘్భ’ చట్టాలను మార్చాలి
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

******************************************

వరంగల్, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఎజెండాతోనే మహాకూటమి ఎన్నికలకు వెళ్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గ్రహించేముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారని అన్నారు. ఈ క్రమంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటు చేశామని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని, తెలంగాణ అమరుల అకాంక్షలు నేరవేరలేదని, అన్ని వ్యవస్ధలను భ్రష్టు పట్టించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన తప్పుల తడకగా మారిందని, స్వయంగా కేసీఆర్ స్వంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని కొత్తకోటలో పాసుబుక్‌లు ఇవ్వనందుకు ఓట్లను బహిష్కరిస్తామని ప్రజలే స్వయంగా హెచ్చరించారని, కేసీఆర్‌కు ఇది సిగ్గుచేటని అన్నారు. సీఎం ఏక పక్ష నిర్ణయాలే ఇందుకు కారణమని, భూ ప్రక్షాళన ఎంత తప్పుల తడకగా, బాధ్యతారహితంగా ఉందో దీన్ని బట్టి అర్ధమవుతుందన్నారు. తెలంగాణ రెవెన్యూ చట్టంలో మార్పులు లేనందున తప్పుడు రికార్డులు ఉన్నాయని నిజాం కాలం నాటి బుజుపట్టిన రెవెన్యూ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మహాకూటమి ఎజెండాలో భూ ప్రక్షాళనపై స్పష్టంగా చట్టం తెచ్చే ఎజెండాను తీసుకువస్తామని, ప్రభుత్వ అన్ని రకాల భూములను వెలుగులోకి తెస్తూ పోడు రైతులకు కూడా హక్కులు కల్పించేలా ఈ నూతన భూ ప్రక్షాళన చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శులు కర్రె బిక్షపతి, పనాస ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల రవి తదితరులు పాల్గొన్నారు.