క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-వరంగల్ క్రైం, అక్టోబర్ 6: తాళంవేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు. వారినుండి 35లక్షల రూపాయల విలువచేసే 900గ్రాముల బంగారం, 12కిలోల వెండి అభరణాలు, మూడు ద్విచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నిందితుల వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా బగోలి గ్రామానికి చెందిన దిలీప్ పవార్(25), భడ్‌కచ్ గ్రామానికి చెందిన సర్వన్ పవార్‌లు బంధువులు కావడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరు నిందితులు నిత్యం మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటు పడడంతో, వారు సంపాదించే ఆదాయం సరిపోక పోవడంతో సులువుగా డబ్బు సంపాదించడానికి చోరీలకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నారు. ప్రణాళికలో భాగంగా వరంగల్ ప్రాంతాన్ని ఎంచుకుని, చోరీలకు పాల్పడాలనుకునే కాలనీలలో పలుమార్లు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి 15చోరీలకు పాల్పడ్డారు. వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో జరిగిన ఈ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన క్రైం విభాగం పోలీసులు నిందితులు నేరాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు. దీంతో నిందితులను పట్టుకోవడానికి సీపీ రవీందర్ ఆదేశాలకు మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు డేవిడ్‌రాజ్, రవిరాజుల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలు మధ్యప్రదేశ్‌కు తరలి వెళ్లాయి. నిందితుల సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి ఐటి కోర్ విభాగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసారు. నిందితులు చోరీ చేసిన సొత్తును అమ్మడానికి ఉదయం వరంగల్ బులియన్ మార్కెట్‌కు హంటర్‌రోడ్డు మీదుగా చోరీచేసిన ద్విచక్రవాహనంపై వస్తున్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానస్పందంగా ద్విచక్రవాహనంపై కనిపించిన నిందితులను ఆపి తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వారి వద్ద బంగారు, వెండి అభరణాలు గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు పాల్పడిన నేరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అరెస్టుచేసి, వారినుండి భారీ ఎత్తున సొమ్మును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో క్రైం అదనపు డీసీపీ అశోక్ కుమార్, ఏసీపి బాబురావు, సీఐలు డేవిడ్‌రాజ్, రవిరాజ్, ఐటికోర్ సిఐ రాఘవేందర్, అసిస్టెంట్ అనాలిటికల్ అధికారి సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.