వరంగల్

ఈవీఎంలపై ఓటర్లకు మరింత పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, అక్టోబర్ 11: ఈవియంలపై ఓటర్లకు మరింత పారదర్శకత కల్పించడం కోసం వివిప్యాట్‌లను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ శి వలింగయ్య తెలిపారు. మహబూబాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని చౌకదారుల దుఖాణదారులకు ఈవియం, వివిప్యాట్‌ల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధి గా పాల్గొన్న కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. ఓటింగ్ విధానం, ఎవరికి ఓటువేశారో వేసిన గుర్తు ప్రదర్శించబడే తీరును, ఓటింగ్ అనంతరం వే సిన ఓట్ల సంఖ్య తదితర అంశాలను వివరించారు. ఎలక్ట్రానిక్ యంత్రాల పనితీరులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. దీనిని ఋజువు చే యడానికి మండలాలవారిగా ప్రతీ గ్రా మం, తండాలకు ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలతో మాక్‌పోలింగ్ నిర్వహించి వారి అపోహలు తొలగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిప్యాట్‌ల కు ఇంటర్‌నెట్ లేనందున వాటిని మా ర్చే అవకాశం లేదన్నారు. ఓటర్లలో మ రింత నమ్మకం కల్పించడమే ఎన్నికల సంఘం లక్ష్యమన్నారు. ఈవిషయం లో చౌకదుఖానాలకు డీలర్లు, తమ వ ద్దకు వచ్చే లబ్ధిదారులకు అనుమానా లు నివృత్తి చేయాలని, అపోహలు, ఆ ందోళనలు తొలగించాలని సూచించా రు. సమావేశానికి ముందు స్థానిక త హశీల్దారు కార్యాలయాల నుండి చౌకధరల దుఖాణదారులతో నిర్వహించి న ర్యాలీని జేసీ డేవిడ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డి యం డబ్ల్యూవో శ్రీనివాస్‌రావు, డిఎవో ఛత్రునాయక్, డిఎఫ్‌వో నర్సింగరావు, డీలర్లు పాల్గొన్నారు.

నేడు తెరాస సమన్వయ సమావేశం
* హాజరుకానున్న ఉపముఖ్యమంత్రి కడియం
మహబూబాబాద్, అక్టోబర్ 11: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలను సమన్వయ పరిచేందుకు మహబూబాబాద్‌పార్లమెంట్ కేంద్రంలోని ఎంపీ సీతారాంనాయక్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించనున్నా రు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆపధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరుకానున్నారు. ఆయనతోపాటు టీఎస్ ఐడిసి చైర్మన్ బాలమల్లు, హైద్రాబాద్ మే యర్ బొంతు రాంమ్మోహన్ రానున్నారు. రెండు నియోజకవర్గాలకు చెందిన సా దక బాధకాలను, నాయకులమధ్య సమన్వయం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. డోర్నకల్ తెరాస అభ్యర్ధి రెడ్యానాయక్‌తోపాటు టికెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌ను, మహబూబాబాద్ పార్టీ అభ్యర్ది శంకర్‌నాయక్‌తోపాటు ఆశావాహుల జాబితాలో ఉండి టికెట్ దక్కించుకోలేకపోయిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితను సమావేశానికి ఆహ్వానించారు. వీరితోపాటురెండు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉన్న నూకల నరేష్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావును పిలిచారు. ఉదయం 11 గంటలకు డోర్నకల్ నియోజకవర్గం, 2 గంట ల తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పరిశీలించనున్నారు. టికెట్‌లు ప్రకటించిన నాటినుండి అంటిముట్టనట్లుగా ఉన్న నా యకులందరిని ఒకే వేదికపైకి తీసుకరావడం ద్వారా కార్యకర్తలకు మంచి సందేశాన్ని అందించాలనే ఆలోచనతో ఈ సమావేశానికి ఎంపి సీతారాంనాయక్ పూ నుకున్నారు.