వరంగల్

ముగిసిన ప్రమీల మావో ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, అక్టోబర్ 14: పేదల పక్షాన నిల్చుండి దొరల అకృత్యాలను అడ్డుకోడానికి అజ్ఞాత ప్రవేశం చేసిన నిడిగొండ ప్రమీల, అలియాస్ జిలానీబేగం రెండు దశాబ్దాల ఉద్యమ మాహాప్రస్థానం ఆదివారం అంతిమయాత్రతో ముగిసింది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు లో ఎన్‌కౌంటర్‌కు గురైన ప్రమీల మృతదేహాం స్వగ్రామం తీసుకురావడానికి ప్రజాసంఘాలు ఎంతో ప్రయాస పడా ల్సి వచ్చింది. ప్రమీలను తమ మనిషిగా చూసుకున్న రాంగూడెం ఆదివాసులు ఆమె శవానికి తమవద్దే అంతిమ సంస్కరణలు జరుపుకుంటామని పట్టుపట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన వారికి ఆంధ్రపోలీసులు, గ్రేహౌండ్ దళాలు అడుగడుగున ఆటటంకాలు కల్సిస్తుంటే ఆదివాసులు ఎదురుతిరిగి నట్లు చెప్పారు. ఎట్టకేలకు ప్రమీల శవం ఉదయం 6.45గంటలకు పోచన్నపేటకు చేరుకుంది. విరసం. పౌరహక్కుల, అమరవీరుల బంధుమిత్రుల కమిటి సభ్యులు ఒక్కరిగా అక్కడికి చేరుకున్నా రు. ప్రమీల భర్త గాజర్ల రవి అలియాస్ గణేష్ సోదరుడు చేర్యాల మాజీ దళకమాండర్ గాజర్ల అశోక్ సైతం తన వదిన అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వాల ఆకృత్యాలకు చమరగీతం పాడలని ప్రజా సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఇందుకు ఉద్యమాన్ని మరోరూపంలో ప్రజల్లోకి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. మృతదేశంపై తల్లి రాములమ్మతోపాటు ప్రతినిధులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. పలువురు విప్లవగీతాలు అలపించారు. అనంతరం పూల తో అలంకరించిన వాహనంలో ప్రమీల మృతదేహాన్ని విప్లవ నినాధాలతో యాత్రగా తీసుకెళ్లి దహన సంస్కరణలు నిర్వహించారు.

21న మానుకోటలో ముస్లింల సభ
గూడూరు, అక్టోబర్ 14: ముస్లింలకు సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సభకు ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు షాబోద్దీన్ పిలుపునిచ్చారు. ఈమేరకు గూడూరు మండల కేంద్రంలోని మసీదు ఆవరణలో బహిరంగసభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ముస్లిం పెద్దలు ఆదివా రం ఆవిష్కరించారు. ఈసందర్భంగా షాబోద్దీన్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అదే విధంగా ముస్లింలకు సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు 17 అసెంబ్లీ, రెండు పార్లమంట్ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకులు కరీం, అన్వర్, ఖాదర్ పాష, మాలీపాష, యాకూబ్‌పాష, షాబోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి రైతులను ఆదుకోవాలి
*తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల
పరకాల, అక్టోబర్ 14: పరకాల వ్యవసాయాధికారిని, తహశీల్దార్‌ను సస్పెండ్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మే 3న కురిసిన వడగళ్ళ వానతో వరి పం టను కోల్పోన రైతులకు ప్రభుత్వం నుండి పంట పెట్టుబడి రాయితీ క్రింద పరిహారం ఇప్పించేందుకు క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిన మండల వ్యవసాయాధికారి, తహశీల్దార్ అవినీతికి పాల్పడి నిజంగా నష్టపోయిన రైతులను విస్మరించి ఆర ఎకరమే సాగు చేస్తే 10 ఎకరాలుగా నమోదు చేసిన పరకాల వ్యవసాయాధికారి, తహశీల్దార్‌ను సస్పెండ్ చేసి రీ సర్వే నిర్వహించాలని, వాస్తవంగా పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించి రైతాంగాన్ని రక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ఆరుగాలం రైతు కష్టం చేసి పండించిన పంటలు చేతి కొచ్చిన పంట నోటికి రాకుం డా పోతే ప్రభుత్వం అందించాల్సిన పెట్టుబడి రాయితీని ఇప్పించేందుకు రైతుల నుండి లంచాలు అశించడమంటే శవాలపైన చల్లే చిల్లరలను కూడా ఏరుకునే రకాలుగా అర్థమవుతుందన్నారు. కొక్కిరాల రాజేశ్వర్‌రావు అనే రైతు 12 ఎకరాల పంట దెబ్బతిన్నదని పత్రికల్లో వచ్చిందని రైతును నాయకులు పరమర్శిస్తే రైతుకు 1 ఎకరం రాసి అసలు సాగు చేయని రైతులకు వేల కొద్ది రూపాయాలు వచ్చే విధంగా నివేదిక రూ పొందించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు అవుతుందన్నా రు. ప్రభుత్వం తక్షణమే రీ సర్వే నిర్వహించి నష్టపోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని లేని యెడల రైతులతో కల్సి ఉద్యమించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రైతులు దగ్గు విద్యాసాగర్‌రావు, పంచగిరి సంపత్, శ్రీనివాస్, మిరుపాల బాపురావు, దగ్గు రమేష్‌రావు తదితరులు పాల్గొన్నారు.