వరంగల్

సిద్దిపేట తరహాలో.. నర్సంపేట అభివృద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 14: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే సిద్దిపేట తరహాలో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని అపద్దర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నర్సంపేటలో ఆదివారం మాలమహానాడు, నంగాభేరిల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రజా ఆశీర్వాధ సభలు జరిగాయి. ఈసభలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ఎన్నికలలో ఓడిపోయిన పెద్ది సుదర్శన్‌రెడ్డి గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా నిధులను నర్సంపేటకు తీసుకవచ్చి ఈ ప్రాంత సమగ్రాభివృద్దికి కృషి చేస్తున్నారని చెప్పారు. గెలిచిన ఎమ్మె ల్యే నియోజకవర్గ అభివృద్దికి ఏ మాత్రం పాటుపడకుండా పత్తా లేకుం డా పోయారని విమర్శించారు. అయితే అభివృద్ది జరగకుండా కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు కుట్రలు పన్నడం సరి కాదన్నారు. కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలకు ధులు తీసుకవస్తే కలెక్టర్‌కు, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయడం ఏంటని నిలదీశారు. కుల సంఘాల వారికి ఆత్మగౌరవ భవనాలు వద్దని చెబుతారా అని ప్రశ్నించారు. నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌కు సైనిక్ స్కూల్‌ను పెద్ది సుదర్శన్‌రెడ్డి తమతో కొట్లాడి తెప్పించుకున్నారని చెప్పారు. రౌడీయిజం, గుండాయిజం, అవినీతి, అక్రమాలను సాగనిచ్చే పరిస్థితే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ చైర్మన్, టీఆర్‌ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, నల్లబెల్లి, నర్సంపేట ఎంపీపీలు బానోతు సారంగపాణి, బాదావుత భద్రమ్మ, నంగారభేరి నాయకులు తేజావతు వాసునాయక్, భూక్య జగన్‌నాయక్, డాక్టర్ జాటోతు ఉదయ్‌సింగ్ నాయక్, ఇస్లావతు తదితరులు పాల్గొన్నారు.

రౌడీషీటర్లపై డేగ కన్ను
*పోలీస్‌స్టేషన్ల వారీగా కౌనె్సలింగ్ ప్రారంభం *కౌనె్సలింగ్‌కు రానివారిపై ప్రత్యేక నిఘా
*వరంగల్ ఏసీపీ పరిధిలో 95మంది రౌడీలు *రౌడీషీటర్ల ప్రవర్తనను బట్టి గ్రేడింగ్ విధానం?
వరంగల్ క్రైం, అక్టోబర్ 14: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వ్యూహరచనలు చేస్తున్నారు. పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టడంలో పూర్తిగా నిమిగ్నమయ్యారు. సీపీ ఎప్పటికప్పుడు ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్ డిసీపీలు, ఏసీపీలతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ అనుసరించ వలిసిన విధి, విధానాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించు కోవడానికి కావలిసిన ఏర్పాట్లు చేయడమే కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో తగి న జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కమి షనరేట్ పరిధిలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట త్రీనగరిలో పేరుమోసిన రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీలు వారి పరిధిలోని స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఏసీపీల పరిధిలోని పోలీసు స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని కౌనె్సలింగ్ నిర్వహించి, తహశీల్ధార్ల ముందు బైండోవర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. నగరానికి చెందిన కొంతమంది రౌడీషీటర్లు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకుల కన్నుసన్నలలో భూదందాలు, సెటిల్ మెంట్లు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణలపై పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. కౌనె్సలింగ్‌కు పిలిస్తే రాకుండా తప్పించుకుంటున్న అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరించేందుకు ముందుకు సాగుతున్నారు. అలాంటి వారి ప్రత్యేక జాబితా ఇప్పటికే తయారు చేసి, సీపీకి అందజేయడం, బాస్ ఆదేశాలతో ఏసీపీల ఆధ్వర్యంలో రౌడీల భరతం పట్టే పనిలో నిమగ్నమ య్యారు. తాజాగా వరంగల్ ఏసీపీ పరిధిలోని మట్టెవాడ, ఇంతేజర్‌గంజ్, మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు రౌడీషీటర్లకు కౌనె్సలింగ్ ఇచ్చారు. అయితే వరంగల్ మహానగరంలో ఎక్కువ శాతం మంది రౌడీషీటర్లు ఉన్న పోలీసు స్టేషన్‌గా మిల్స్‌కాలనీకి ఉంది. ఈ పోలీసు స్టేషన్ పరిధిని ఏసీపీ ప్రత్యేక జోన్‌గా పరిగణించి, గత కొనే్నళ్లుగా పోలీసు స్టేషన్లకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న రౌడీషీటర్లకు తమ పద్దతిలో మార్క్ చూపుతున్నారు. దీంతో రాజకీయ నాయకుల వెనుకాలే తిరుగుతున్న రౌడీషీటర్లు వరంగల్ ఏసీపీ దూకుడుతో భయంతో వణికిపోతున్నారు. వరంగల్ ఏసీపీ పరిధిలోని మూడు పోలీసు స్టేషన్లలో 95 మంది రౌడీషీటర్లు ఉన్నారు. అందులో మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోనే సగానికి పైగా మంది రౌడీషీటర్లు ఉన్నారు. చాలామంది రౌడీయిజం చేయకుండా సాధారణ జీవితం గడుపుతున్నారని, కొంతమంది రౌడీషీటర్లు కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలలో చేరడం, నాయకుల అవతాతరమెత్తి బడా నేతల అండదండలతో దర్జాగా తిరుగుతున్నారని ఏసీపీకి స్థానిక పోలీసులు సమాచారం అందించారు. కాగా, కమీషనరేట్ పరిధిలోని రౌడీషీటర్ల ప్రవర్థనను బట్టి పోలీసు అధికారులు గ్రేడింగ్ ఇస్తున్నారు. ఎలాంటి మార్పు రాకుండా రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వాళ్లకు ఏ గ్రేడ్ రౌడీలుగా, ఐదు సంవత్సరాలుగా ఎలాంటి కేసులు కాకుండా సాధారణ జీవితం గడుపుతున్న వారిని బి గ్రేడ్‌గా, 50సంవత్సరాల వయస్సు దాటి, ఎలాంటి కేసులు లేకుండా ఉన్న వారి వివరాలను ఏసీపీలు సీపీకి అందించనున్నారు. నాయకుల అండదండలతో కౌనె్సలింగ్‌కు హజరు కానీ రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.

దీక్ష నాటకం ప్రజలకు తెలుసులే!
* వచ్చే ఎన్నికలతోనే టీఆర్‌ఎస్ బాగోతం ముగుస్తుంది * పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
* కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మసంతోష్‌రెడ్డి
జనగామ టౌన్, అక్టోబర్ 14: తెలంగాణ తన వల్లనే వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షలో ఏం నాటకం ఆడారో ప్రజలు గమనిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలో శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిర్నిగడ్డ దుర్గామాత దేవాలయం, సంతోషిమాత ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం అన్నధాన కార్యక్రంలో పాల్గొన్నారు. స్థానిక కామాక్షి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ధర్మ సంతోష్‌రెడ్డి తన వందలాది అనుచరులతో పొన్నాల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మ య్య మాట్లాడుతూ కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో ఉపయోగించిన మెడిసిన్స్‌కు సంబందించిన రిపోర్ట్స్‌ను బహిర్గతం చేస్తే ఆయన తతాంగం అంతా భయటపడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలు తోడ్పాటునందించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కొద్దిరోజుల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలతోనే టీఆర్‌ఎస్ బాగోతం ముగుస్తుందని.. కేసీఆర్ నాలుగేండ్ల పాలనకు విసిగివేచారిన ప్రజలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కంకనం కట్టుకుని ముందునిలుస్తున్నారని అన్నారు. 1969 నుండి జరుగుతున్న తెలంగాణ ఉద్యమాల ద్వారా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షురాలు, యూపీఏ చైర్మన్ సోనియాగాంధీ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. నిరంకుశత్వ, కుటుంబ పాలనను పారదోలడానికి ప్రజలు సన్నదం అవుతున్నారని తెలిపారు. మహాకూటమి అంటేనే కేసిఆర్ గుబులు పడుతున్నారని విమర్శించారు. వందకు పైగా సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికుతున్నాని అన్నారు. ఆయన మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరనేది అర్ధం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచరాములు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిథి రంగరాజు ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు అన్వర్, ధర్మపూరి శ్రీనివాస్, ఆకుల వేణు, వంగాల కళ్యాణిమల్లారెడ్డి, శ్రీలతసత్యనిరంజన్‌రెడ్డి, పన్నీరు రాధిక, నాయకులు మహేందర్‌రెడ్డి, ఉమాపతిరెడ్డి, మల్లేషంలు పాల్గొన్నారు.