వరంగల్

మకర వాహనంపై ఊరేగిన భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 10: వరంగల్ నగరంలో భూతల మణిద్వీపంగా అలరారుచున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటలకు నిత్యాహ్నికం, చతుస్థానార్చన జరిపి ఉదయం 11 గంటలకు అమ్మవారిని ‘సర్వశుభంకరి’గా అలంకరించి మకర వాహనంపై ఊరేగించారు. మకర వాహనంపై సేవింపబడుతున్న సర్వశుభంకరీ అమ్మవారు భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న భక్తులను తరింపజేసింది. సాయంత్రం అమ్మవారిని ‘చంద్రాపరమేశ్వరి’గా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. సమస్త ఓషదులకు అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క చల్లని వెనె్నలతో ఈ జగత్తంతా స్వాంతన పొందుతుంది. చంద్రప్రభ వాహనంపై సేవింపబడుతున్న అమ్మవారి దర్శనం వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ కార్యక్రమాలకు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా ప్రకాష్ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రకాళీ అమ్మవారి సన్నిధానంలో నామ పారాయణం లక్ష కుంకుమార్చన జరుపుకొనే అవకాశం కలుగకుండా కార్యక్రమంలో పాల్గొన్న స్ర్తిలందరికీ అమితానందం కలిగింది. వేలాది మంది స్ర్తిల సహస్రనామ పారాయణంతో ఆలయ పరిసర ప్రాంగణం మొత్తం లలిత నామంతో మార్మోగింది. దర్శనానికి వచ్చిన భక్తులు కూడా పారాయణం పూర్తయ్యే వరకు ఎక్కడివారు అక్కడే నిలబడిపోయారు. అనంతరం గ్రహమకం, గణపతి, దుర్గా, సుదర్శన హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మందికి అన్నదానం జరిపారు. భద్రకాళీ భద్రేశ్వరుల ఎదురుకోలు ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ. 516లు చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చునని ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్ట అంజనీదేవి తెలిపారు.