వరంగల్

ఇచ్చిన హామీలే అమలు కాలేదు మళ్లీ కొత్త హామీలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, అక్టోబర్ 16: ఇచ్చిన హామీలే అమ లు కాలేదు, మళ్లీ కొత్త హామీలా..? ఇచ్చిన హామీలపై ఆశీర్వాద సభలలో శే్వతపత్రం విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం అన్నారు. మంగళవారం వరంగల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఏం అమలు చేసిందో తెలియదు కాని మేనిఫెస్టోలో మాత్రం విడుదల చేయడంలో ముందుందని అన్నారు. 2014 ఎన్నికలలో ఇచ్చన హామీలే నేరేవేర్చలేదు, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో విడుదలచేస్తే మీ హామీలను నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు లేరని ఆయన ఎద్దేవా చేశారు. కోటి ఆశలతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు ఎవరో యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసని, అది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. తెలంగాణ విభజన చట్టం ద్వారా కేంద్ర నుండి రాష్ట్రానికి రావలసిన గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, చెవెళ్ల-ప్రాణహితకు జాతీయ హోద, ఎయిమ్స్ వంటి హామీలు, నిధులను తీసుకరావడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన అన్నారు. తెరాస పార్టీ నిర్వహించే సభలు ఆశీర్వాద సభలు కాదు కాని అవి టీఆర్‌ఎస్ పార్టీ అస్తమించే చివిరి సభ లు అని అన్నారు. ఈ సమావేశంలో బాస్కుల ఈశ్వర్, జిలికర వీరస్వామి, బొల్లంరాజు, నాగవెల్లి, తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కాటారం, అక్టోబర్ 16: ఆరుగా లం కష్టపడి వ్యవసాయం చేసే అన్నదాత అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంక ర్ భూపాలపల్లి జిల్లా కాటారం మం డలంలో చోటుచేసుకుంది. కాటా రం ఎస్‌ఐ నరేష్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మీపూర్ సమీపంలోని దుబ్బపల్లికు చెందిన సూరం బాపు(42) అనే వ్యవసాయ రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 30 గుంటల భూమిలో వరి పంట పండిస్తుండగా, అదే గ్రామానికి చెందిన సంతోషం శ్రీనివాస్ రెడ్డి అనే అసామి వద్ద మరో మూడు ఎకరాలు కౌలుకు భూమిని తీసుకొని, అందులో పత్తి పంట పండిస్తున్నాడు. కాగా వాతావరణం అనుకూలించక, పంటల సాగుకు తీసుకొచ్చిన అప్పులు భారంగా మారడంతో దినదినం మానసిక క్షోభకు సూరం బాపు గురయ్యేవాడని పోలీసులు తెలిపారు. అవివాహిత కూతురు సంధ్య, కుమారుడు రాజులు ఉన్నారని మృతుడి భార్య రాజేశ్వరి తెలిపారు. పిల్లల పెళ్ళిళ్ళు, పంటలలో నష్టం వస్తుందనే ఆందోళనతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. కాగా సోమవారం రాత్రి చికిత్స పొందుతూ సూరం బాపు మృతి చెందాడని మృతుడి భార్య వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం ఎస్‌ఐ నరేష్ తెలిపారు.

ప్రగతి భవన్‌వరకు అల్లుళ్ల బస్సు యాత్ర
* కేసుల భయంతో మోదీ దగ్గర మోకరిళ్లన కేసీఆర్
* పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
బచ్చన్నపేట, అక్టోబర్ 16: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచి అధికార మత్తులో టీఆర్‌ఎస్ తూగుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంగళవారం బచ్చన్నపేటనుంచి ప్రగతి భవన్‌వరకు అంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్లుళ్ల బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ.. హామీగానే మిగిలిపోయిందని ఆరోపించారు. కేసీఆర్, ఆయన పూర్వికులు ఆంధ్రప్రాంతం వారని ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తు దోచుకుతుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో 55 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని అన్నారు. ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 1150 ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ హామి ఇచ్చినట్లుగా 22 లక్షల డబల్‌బెడ్ రూమ్‌లు నిర్మించి ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఇంకా ఏ ఒక్కరికి ఇవ్వలేదని అన్నారు. నిర్మాణాలు 75 ఏళ్లకుగాని పూర్తికావన్నారు. ఆయనకు కావలసింది అధికారాలు, పదవులు తప్ప మరేమి అవసరలేదన్నారు. ఎదిరించిన వారిపై కేసులు పెట్టి తన కేసులనుంచి తప్పించుకోడానికి మోదీకాళ్ల దగ్గర మోకరిల్లుతున్నాడని విమర్శించారు. రూ. 2000కోట్ల మిషన్‌భగీరథ అంటూ కుటుంబ సభ్యులంతా కలిసి దోపిడిగి తెగబడినారని అన్నారు. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగనన్న కెసిఆర్ ఎన్ని ఊళ్లకు నీళ్ళు ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. తట్టెడు మట్టితీయనోళ్లు చెరువులేలా నింపారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ శేషజీవితం చర్లపల్లి జైలులోనే గడపాల్సి ఉంటుందని జోష్యం చెప్పారు. రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వలేని కెసిఆర్ ప్రభుత్వానికి ఈ అల్లుళ్ల బస్సు యాత ఓ చెంపపెట్టులాంటిదని అన్నారు. టిఆర్‌ఎస్‌లోంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత ధర్మ సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ మాటటా నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్తమామలు టిఆర్‌ఎస్ ఎంపిటిసి అయిన్నప్పటికీ నాలుగున్నరేళ్లలో స్వంత ఇల్లుకట్టుకోలేని పరిస్థితని వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల వేణుగోపాల్, నిడిగొండ శ్రీనువాసు, గంగం బుచ్చిరెడ్డి, గుర్రపుబాలరాజు, జ్యోతి భాస్కర్, బుర్ర బాలమణి, వేముల లక్ష్మయ్య, బచ్చన్నపేట అల్లులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.