వరంగల్

మహాకూటమికి ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి, అక్టోబర్ 21: వచ్చే అసేంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తిలో మహాకూటమికి ఓటామి ఖాయమాని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అదివారం మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో చేరారు. అనంతరం అయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పరిపాలన కాలంలోనే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలొనని నాయకులు ఏమొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. పాలకుర్తిలో కాంగ్రెస్ నాయకుల అభివృధ్ధి శిలాఫలకాలకే పరిమితం అయితే తను గెలిచాకే ప్రభుత్వంతో కొట్లాడి పనులు ప్రారంభించినట్లు పేర్కోన్నారు. వ్యవసాయ మార్కెట్, గురుకులల ఏర్పాటు, పాలకుర్తి, చెన్నూర్ రిజర్వాయర్ల పనులు ప్రారంభించినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటనతో కాంగ్రెస్‌పార్టీలో ఓణుకు పుట్టిందని, వారికి వచ్చే ఎన్నికల్లో పరాభావం తప్పదాని జోస్యం చేప్పారు. అభివృధ్ది చేసే పార్టీకి ప్రజలు అదరించి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్,మండలపార్టీ అధ్యక్షులు నల్ల నాగిరెడ్డి,మార్కెట్ చైర్మెన్ ముస్కు రాంబాబు,రైతు సమన్వమ సమితి మండల అధ్యక్షులు విరమానేని యాకంతరావు, నాయకులు నవీన్, వెంకటెష్, దీపక్, తదితరలు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
* నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవరెడ్డి
రాయపర్తి, అక్టోబర్ 21: వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలు పనిచేయాలని పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కొండాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామం నుండి 50 మంది కార్యకర్తలు జంగా సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మండలంలోని కిష్టాపురం క్రాస్ రోడ్డు వద్ద వీఎన్‌ఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ మండల యోజన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపడుతున్న అవినీతి కార్యకలపాలకు యువత చిదరించుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ వైపే యువత ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారే తప్పా ఏనాడు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని అన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుల వలె కృషి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో యువజన స్ధాయి మండల అధ్యక్షుడు ఎసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అమ్యానాయక్, మహేందర్‌రెడ్డి, కాశీనాథం, బోనగిరి ఎల్లయ్య, చిడిమిల్ల అశోక్, ముర్రి రాజేందర్, ఖాజామీయా, దొమ్మటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.