వరంగల్

అమరవీరులు గుండెల్లోనే ఉంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, అక్టోబర్ 21: పోలీసు అమరవీరులు ఎల్లప్పుడు మన గుండెల్లో జీవించే ఉంటారని, ప్రజలకోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను మరువలేమని వరంగల్ పోలీసు కమిషనర్ డా. రవీందర్ కొనియాడారు. ఆదివారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. పోలీసు అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రజల్లో పేరు ప్రతిష్టలు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని కోరారు. అసువులు బాసిన అమరుల కుటుంబాలను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారికి ఎలాంటి సమస్య తలెత్తిన పోలీసు విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 414మంది పోలీసు అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ బి.అశోక్‌కుమార్ చదివి వినిపించారు. అనంతరం సీపీ రవీందర్, కెయూ వీసీ ఫ్రొఫెసర్ సాయన్న, జేసీ దయానంద్, అటవీశాఖ అధికారి పురుషోత్తం, తెలంగాణ రీజియన్ జైళ్లశాఖ ఇన్‌చార్జ్ డీఐజీ మురళీబాబుతోపాటు డీసీపీలు, , ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల సంఘం, ఇతర పోలీసు సిబ్బంది పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి, నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ ఐ భాస్కర్ సారధ్యంలో సాయుధ పోలీసుల శోక్ శ్రస్థ్ చేసి, రెండు నిమిషాలు వౌనం పాటించారు.
వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్ పోటీలు
అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కమిషనరేట్ పరిధిలో వ్యాసరచన, డ్రాయింగ్, వకృత్వ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి, విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు సీపీరవీందర్ జ్ఞాపికలు అందజేసారు. ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలో ద్వితీయ విజేతగా నిలిచిన కాజీపేట పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండారి సారయ్యకు జ్ఞాపికను అందజేసి, సన్మానించారు. అనంతరం కమిషనరేట్ కార్యాలయంనుండి అశోకా ధియేటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యుల సమస్యలను సీపీ రవీందర్ అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం గురించి సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచార హోరు
వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 21: మండలంలో శాసన సభ ఎన్నికల ప్రచారం గ్రామాల్లో రాజకీయ పార్టీలు హోరు ఎత్తిస్తున్నాయి. 18 పంచాయితీలు 21 పోలింగ్ బూత్‌లలో ఇప్పటికే తెరాస అభ్యర్ధి వెంకటాద్రి నాలుగు పర్యయాలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే భద్రాచలం సీపీ ఏం పార్టీ అభ్యర్ధి మిడియం బాబురావు ఎన్నికల ప్రచారంలో తెరాస కంటే వెనుకబడి ఉన్నారు. తెరాస అభ్యర్ధిని నెల రోజుల క్రితం ప్రకటించడంతో అప్పటి నుండి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మండలంలో వెంకటాపురం, వాజేడు మండలాలో అభ్యర్ధి వెంకటాద్రి గ్రామ గ్రామాన మోటర్ సైకిల్ ర్యాలిని, రోడ్డుషోలను ఇంటింటా ప్రచారంతో ఓటర్లను కలుసుకుని అభివృద్ధి సంక్షేమ పథకాలకే ఓట్లు వేయ్యాలని ప్రచారంలో దసుకపోతున్నారు. సీపీఏం పార్టీ సిట్టింగ్ స్ధానాన్ని ఎలాగైన దక్కించుకోవాలని ప్రచారాన్ని సీపీ ఏం పార్టీ సైతం జోరు పెంచింది. ఈ క్రమంలో కూటమిలో భాగంగా ఈ సీటు ఎవ్వరికి వస్తుందో తెలియని పరిస్ధితి ఉంది. దీంతో ప్రచారంలో వెనుకబడి పోతుందని పార్టీ శ్రేణులు అంటున్నారు.