తెలంగాణ

దుర్గామాతగా భద్రకాళి సింహ, గజ వాహనాలపై ఊరేగిన అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 11: వరంగల్ నగరంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు బుధవారం నాల్గవ రోజుకు చేరుకున్నాయి. శంకర జయంతి సందర్భంగా ఉదయం అమ్మవారికి ఉషః కాలార్చన పూర్తయిన అనంతరం జగద్గురు శంకరాచార్య జయంతిని భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన, ఉత్సవంగా నిత్యబలి పూర్తి చేసి అమ్మవారిని దుర్గామాతగా అలంకరించి సింహ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం శ్రీ లక్ష్మీమాతగా అలంకరించి అమ్మవారిని గజవాహనంపై ఊరేగించారు. భద్రకాళీ భద్రేశ్వరస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మిరుమిట్లు కొలిపే విధంగా విద్యుత్‌కాంతులతో జిగేల్ మంది. ఒకవైపు గుట్టలు, మరోవైపు భద్రి తటాకంతో సూర్యాస్తమ సమయంలో సముద్ర కెరటాలను తలపించే విధంగా భద్రకాళీ చెరువులో వీస్తున్న అలలపై పడుతున్న దీపకాంతులతో దేవాలయం కళకళలాడింది.
ఓరుగల్లు దాహం తీరింది