వరంగల్

కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మే 13: తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోందని, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి హరీశ్‌రావు విలేఖర్లతో మాట్లాడారు. గతంలో కాంట్రాక్టుల కోసం, జేబులు నింపుకునేందుకు ప్రాజెక్టులు కట్టేవారని అన్నారు. రైతుల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని, ఈ క్రమంలో ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి నిర్మిస్తున్నామని చెప్పారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను రోజుకు రెండు టిఎంసిల చొప్పున మళ్లించి 8వేల క్యూసెక్కుల నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తీరుతామని చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుతగులుతూ కోర్టులలో ఫిటిషన్లు వేస్తు అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. దొంగలు, ద్రోహులు ఒక్కటయ్యారని, ఇందుకు పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జత కలవడమేనని అన్నారు. గత 60 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్, టిడిపి పార్టీలు కేవలం 210 గురుకుల పాఠశాలలను మాత్రమే స్థాపించాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ 20 నెలల కాలంలోనే అనేక పథకాల ఒరవడితో ముందకు సాగుతున్నాడని, వచ్చే విద్యాసంవత్సరం ఏకంగా 220 ఆంగ్ల మాధ్యమంలో గురుకుల పాఠశాలలు స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. పేద, బడుగు బలహీనవర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపి సీతారాంనాయక్, టిఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.