వరంగల్

దేశానికే తలమానికం మిషన్ కాకతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జఫర్‌గడ్, మే 13: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ దేశానికే తలమానికమని మాజీ డిప్యూటీ సిఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని తీగారం, సమ్మడ్‌పల్లి, ఒగ్లాపూర్, సాగరం, కొనాయిచలం, గర్మిళ్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సిఎం రాజయ్య మాట్లాడుతూ కాకతీయులు, రెడ్డిరాజుల హయాంలో గొలుసుకట్టు చెరువులను ఎన్నో సంవత్సరాల క్రితమే మరమ్మతులు చేయడం జరిగిందని అన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అట్టి చెరువులపై గత ప్రభుత్వాలు కనె్నత్తికూడా చూడలేదని, దీంతో 70వేల చెరువులకు గాను 30వేల చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చెరువుల పునరుద్ధరణ కోసం 45వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి మొదటివిడతలో 103 చెరువులను మరమ్మతులు చేయడం జరిగిందని అన్నారు. రెండవ విడతలో 90చెరువులను 45కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. జఫర్‌గడ్ మండలానికి ఏడు చెరువులకు 3కోట్లు వెచ్చించి మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. మిషన్‌కాకతీయ పనుల్లో అలసత్వం వహించకుండా గుత్తేదారులు పని చేయాలని సూచించారు. పనులను ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి అరుణశ్రీ, ఎంపిపి స్వరూప, పిఏసిఎస్ చైర్మన్ సోమిరెడ్డి, ఎంఆర్‌ఓ మనోహరచారి, ఎంపిడిఓ రవిందర్, సర్పంచ్‌లు ఇన్నారెడ్డి, సుజాత, స్వప్న, రవీందర్, పార్టీ నాయకులు, తదితరులున్నారు.