వరంగల్

ప్రజల ముంగిటకే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, మే 13:ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం నిరంతరం సిద్దంగా ఉందని, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని 39,40,41,42,43,44 డివిజన్లలో ఆయా డివిజన్ల కార్పోరేటర్లతో కలసి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాబోయే రోజులలో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని అన్నారు. డివిజన్లలోని ప్రజల దాహార్తిని తీర్చిడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని కూడా అధిగమించి చక్కని పాలన అందిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టినన్ని పథకాలు, ఏ రాష్ట్రం ప్రవేశ పెట్టలేదని తెలిపారు.
సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని నిరంతరం కార్పోరేటర్లు పర్యవేక్షించాలని సూచించారు. మంత్రులనుండి సామాన్య కార్యకర్తవరకు పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అన్నారు. సంక్షేమ పథకాలు అందవలసిని వారికి అందినపుడే మన కెసిఆర్ కలలుకంటున్న బంగారు తెలంగాణ సాధ్యమని వివరించారు. ప్రతి తెలంగాణ పౌరుడు నిబద్దతతో వ్యవహరిస్తే బంగారు తెలంగాణ కష్టసాధ్యమేమి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ సిరాజోద్దిన్, కార్పోరేటర్లు అనిశెట్టి మురళి, తాడిశెట్టి విద్యాసాగర్ పాల్గొన్నారు.