తెలంగాణ

ధనలక్ష్మిగా భద్రకాళి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 13: వరంగల్‌లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం 6వ రోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం జరిపిన తరువాత చతుఃస్థానార్చన సదస్యం ఉదయం 11 గంటలకు అమ్మవారిని పల్లకిసేవలో ఊరేగింపు జరిపారు. సాయంత్రం భద్రకాళీ అమ్మవారిని ధనలక్ష్మీ అలంకరణతో శేష వాహనంపై ఊరేగింపు జరిపారు. పల్లకిసేవలో ఊరేగింపబడుతున్న అమ్మవారిని దర్శించిన వారికి అధిక ప్రాప్తి కలుగుతుందని, శేష వాహనంపై అమ్మవారిని ధనలక్ష్మీ అలంకరణలో దర్శించుకున్న వారికి యోగసిద్ధి, విద్య, విజయ, వివిధ శ్రేయస్సులు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు తెలిపారు. శుక్రవారం కావడంతో ధనలక్ష్మీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వరంగల్ జిల్లా కమ్మ సేవా సంఘం ఉభయదాతలు కావడం వల్ల అనేక మంది కమ్మ కుల పెద్దలు బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి పల్లకి సేవ కావడంతో పట్టణంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సిర్పూర్‌కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, హైదరాబాద్ షేర్‌లింగంపెల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

కొనసాగుతున్న
సాగర్ ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్, మే 13: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో గత నాలుగురోజులుగా కొనసాగుతుంది. ఆంధ్రా రాష్ట్రానికి 6 టిఎంసిలు, తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్‌కు 3 టిఎంసిల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు గత 4 రోజులుగా శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నాడు శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు 4,659 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాయంత్రానికి 5,522 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుంది. సాగర్ జలాశయం నుండి 800క్యూసెక్కుల నీటిని ఎస్‌ఎల్‌బిసికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 507.40 అడుగుల నీటిమట్టం ఉండగా శ్రీశైలంలో 779.70 అడుగుల నీటిమట్టం ఉంది.

కుల వృత్తులను ఆదుకుంటాం
మంత్రి తలసాని వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవడానికి అనేక చర్యలు చేపడుతున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. పాడి పరిశ్రమ దాని అనుబంధ సంఘాలను బలోపేతం చేయడానికి వాటిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. శుక్రవారం సచివాలయంలో పాడి, మత్స్య, గొర్రెల పెంపకం దాని అనుబంధ రంగాల సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన వారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు ముందు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన వారి సమస్యలను అధ్యయనం చేయడానికి త్వరలోనే జిల్లాల్లో పర్యటించనున్నట్టు మంత్రి చెప్పారు. ఈ నెల 18వ తేదీన నల్లగొండ జిల్లా నుంచి తన పర్యటనలు ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.
బాయలర్ ప్రమాదంలో
కార్మికుడు దుర్మరణం
మరో ఆరుగురి పరిస్థితి
ఆందోళనకరం
షాద్‌నగర్ రూరల్, మే 13: ఐరన్ పరిశ్రమ బాయిలర్ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందడంతో పాటు ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ సమీపంలోని ఓ ఐరన్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఇనుమును తీసుకువెళ్తున్న లేయర్ ఒక్కసారిగా కుప్పకులి తొమ్మిది మంది కార్మికులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి తీవ్రంగా ఉండటం వల్ల హైద్రాబాద్‌లోని డిఆర్‌డిఏ ఆపోలో ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించేందుకు తీసుకువెళ్తుండగా ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఎనిమిది మంది కార్మికులకు చికిత్స చేయిస్తున్నారు. కానీ ఇందులో ఆరుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని సమాచారం. కాలిన ఐరన్ రాడ్స్ బట్టి వద్ద ఉన్న కార్మికులపై ప్రమాదవశాత్తు పడటం వల్ల కార్మికుల శరీరాలు అధిక శాతం కాలినట్లు తెలిసింది. ప్రమాదంపై వివరాల కోసం వచ్చిన మీడియాను పరిశ్రమ యాజమాన్యం అనుమతించలేదు. షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగేనావర్ విచారణ జరుపుతున్నారు.