వరంగల్

ప్రశాంతంగా ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 15: టిఎస్ ఎంసెట్ పరీక్ష వరంగల్‌లో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌కు 13,238 మంది విద్యార్థులకు గాను 12,872మంది విద్యార్థులు హాజరయ్యారు. 97.23శాతం హాజరు కాగా మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్‌కు 8,414 మంది విద్యార్థులకు గాను 8,045 మంది విద్యార్థులు హాజరు కాగా 95.61 శాతం నమోదైంది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఎంసెట్ పరీక్షలు జరిగాయని ఎంసెట్ వరంగల్ రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని సుబేదారి ఆర్ట్స్ కళాశాల, పిజి కళాశాల పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వాహన తీరును పర్యవేక్షించారు. నగరంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు గాను 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు పరీక్షలు జరుగగా మెడికల్ విద్యార్థులకు మద్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు జరిగాయి. ఎంసెట్ పరీక్షల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే అనుమతించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు మధ్య ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.