వరంగల్

మహాకూటమిదే విజయం: పొన్నాల లక్ష్మయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 20: ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ టీఆర్‌ఎస్ పార్టీ అని ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, జనగామ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం బచ్చన్నపేట మండలం టీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల నుండి నల్లగోని వేణు ఆధ్వర్యంలో 100మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే జనగామ పట్టణంలోని 1వ వార్డు నుండి పిట్టల రాజు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుం డి 200ల మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పొన్నాల లక్ష్మ య్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, వారి సంక్షేమపథకాల వల్ల బడుగు, బలహీన వర్గాలకు లబ్ది చేకూర్చలేదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయంతో అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు జీవన భృతితో పాటు తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామన్నారు. మహాకూటమికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. అధికారంలో నుండి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, ఆయ న ఎక్కడికి వెళ్ళినా నిరసనలు వెళ్ళువెత్తుతున్నాయని ఆయన ఆరోపణ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కంచరాములు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఎండీ. అన్వర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఆకుల వేణుగోపాల్, మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, అధికార ప్రతినిథి రంగరాజు ప్రవీణ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యిద ర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మేడ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ణాకర్‌రెడ్డి, అల్వాల వెంకటేషం, కట్టెం కర్ణాకర్, ధయాకర్, నాగరాజు, సుధీర్‌లు పాల్గొన్నారు.

తోక పార్టీలతో మహాకూటమి ఏర్పాటు
పొన్నాల లక్ష్మయ్య వల్లే జనగామ వెనకబాటు : మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
బచ్చన్నపేట, నవంబర్ 20: తోక పార్టీలన్ని మహాకూటమిగా ఏర్పడి తన్నుకు చస్తున్నారని, ఓట్లకోసం వస్తున్న వాటిని తిప్పికొట్టాలని జనగా మ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో భారీ నీటిపారుల శాఖ మంత్రిగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యవల్లే జనగామ నియోజకవర్గం వెనకబాటుకు గురైందని అన్నారు. మంగళవారం గంగాపూర్, నాగిరెడ్డిపల్లి, కొనె్న గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కారు గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్నినాళ్లు తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదు. కేసీఆర్ చేస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. రైతుబంధు పథకం అమలుపై ఐక్యరాజ్య సమితి కేసీఆర్‌ను ప్రశంసించడం విశేషం అన్నారు. తిరిగి కేసిఆర్‌ను ఎన్నుకుంటే తెలంగాణ మరింత అభివృద్ది సాధించగలదన్నారు. పేదలకోసం నిరంతరం తపించే టిఆర్‌ఎస్ గెలిపించుకుంటే పేదల బతుకులు మెరుగుపడతాయని సూచించారు. ఓట్లకోసం వస్తున్న పొన్నాలను నిలదీయాల సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, సామాజికసేవా కార్యకర్త ముక్కెర తిరుపతిరెడ్డి, జడ్పీటి సభ్యురాలు స్కప్నసాగర్, మండలశాఖ అధ్యక్షులు చంద్రారెడ్డి, వైస్ ఎంపిపి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు బాల్‌రెడ్డి, వేముల బాల్‌నారాయణ, సంజీవరెడ్డి, నరేందర్, జావీద్, షబ్భీర్, కార్యకర్తలు పాల్గొన్నారు.