వరంగల్

ఉమ్మడి వరంగల్‌లో 8 స్థానాలను కాంగ్రెస్‌వే: కొండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, నవంబర్ 20: వరంగల్ ఉమ్మడి జిల్లాలో శాసనసభా ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని ఎమ్మెల్సీ కొండా మురళీధర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సంగెం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల రవీందర్‌గౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యంగా కొండా దంపతు లు పనిచేస్తున్నారని ప్రజా సంక్షేమానికి పాటుపడిన వారినే ప్రజలు అదరించి అభిమానిస్తారని అన్నారు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖదే గెలుపు ఖాయం అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారంతో నియోజకవర్గంలోని అన్ని కాంట్రాక్టు పనులను అయనే దక్కించుకుని కోట్లకు పడగెత్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనగాం రమేష్, అంజన్‌రావు, నర్సింహానాయక్, ఆగపాటి రాజు, పులి వీరస్వామి, అంబటి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుభిక్షం: శ్రీధర్‌బాబు
కాటారం, నవంబర్ 20: కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రజ లు సుభిక్షంగా ఉన్నారని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్ధిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం కాటా రం మండలంలోని బస్వాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఇందులో మండలంలోని కొత్తపల్లికి చెందిన గంగపుత్రులు, మహాదేవపూర్ మండలంలోని బెగుళూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పాలన చెరగని ముద్ర వేసిందని, అందుకే మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్న అశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో ఎన్నికలలో పనిచేయాలని సూచించారు. మంథని నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక పలు మండలాల నుంచి వందలాది మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం, మహాదేవపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, చల్ల తిరుపతిరెడ్డి, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు తోడే మాధవరెడ్డి, మాజీ సర్పంచులు ఆజ్మీరా రఘురాం, ఉప్పుల రాజయ్య, నాయకులు పాగె చంటి, గడవేన దేవేందర్, సుందిళ్ళ ప్రభుదాస్, దాసరి సదయ్య, కందుల కోటేశ్వర్‌రావు, ఆజ్మీరా తిరుపతి, ఎల్లంకి వెంకన్న, బుర్ర చలంగౌడ్, తిరుమల్, రవి, చిట్యాల చిరంజీవి, రాజేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీకి పట్టుబడిన రంగయ్యపల్లి వీఆర్‌వో
భీమదేవరపల్లి, నవంబర్ 20: భీమదేవరపల్లి మండలంలోని రైతు బొల్లవేణి రవి వద్ద వంగర వీఆర్‌వో రూ.5వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ భద్రయ్య మంగళవారం పట్టుకున్నారు. వంగర గ్రామానికి చెందిన రవి పాసుబుక్కులు రాకపోవడంతో గత ఆరునెలలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో వీఆర్ వో రమేష్ తనకు రూ.5వేలు ఇస్తే పట్టాదారు పాసు పుస్తకాలు త్వరగా ఇస్తానని చెప్పాడు. మంగళవారం భీమదేవరపల్లి మండలం తహశీల్ధార్ కార్యాలయంకు వచ్చిన రైతు బొల్లవేణి రవి వీఆర్‌వో రమేష్‌కు రూ.5వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సిబ్బంది వెంకట్, సతీష్, క్రాంతి సిబ్బంది పాల్గొన్నారు.