వరంగల్

ఆయూష్ కోర్సులకు నీట్ తప్పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 20: 2019-2020 విద్యా సంవత్సరం నుండి ఆయూష్ కోర్సుల్లో ప్రవేశాలకు నిట్ యూజీ స్కోర్ ఆధారంగానే చేపట్టనునట్లు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయూష్ కోర్సులకు నిట్ తప్పని సరి అని కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖా వెల్లడించింది. ఈ సంవత్సరం నుండి నిట్‌తోనే ఆయూష్ సీట్ల భర్తీ అనే నిబంధన తప్పనిసరి అయినప్పటికి ఇంకా కొన్ని అపోహలు ఉండడంతో ఆయూష్ మంత్రిత్వ శాఖా నిట్ తప్పని సరిచేస్తూ నోటిఫికేషన్ జారీ ఒక స్పష్టతనిచ్చింది. ఈ మేరకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ బీహెచ్‌ఎంఎస్, బీఎయంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సులకు సీట్లను నిట్ ద్వారా భర్తీ చేస్తామని తెలుపుతూ నేడు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడవచ్చునని రిజిస్ట్రార్ తెలిపారు.

అభ్యర్థులు క్రిమినల్ కేసులపై ప్రకటనలివ్వాలి
* 22 నుంచి డిసెంబర్ 5 తేదిలోపు: రూరల్ జిల్లా ఎన్నికల అధికారి హరిత
వరంగల్, నవంబర్ 20: అభ్యర్ధులు తమపై ఉన్న కేసుల వివరాలను ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న వార్తా పత్రికల్లో ప్రకటనివ్వాలని జిల్లా ఎన్నికల అధికారి హరిత ఒక ప్రకటనలో కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను అనుసరించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తమపై క్రిమినల్ కేసులు నమోదు అయినా లేదా పెండింగ్‌లో ఉన్నా లేదా దోషిగా తేలిన ఆయా కేసుల వివరాలకు సంబంధించిన ప్రకటన (్ఫరం సీ-1)ను నియోజకవర్గ పరిధిలో ఎక్కువ సర్కులేషన్ గల వార్తా పత్రికల్లో కనీసం మూడు తేదీలలో ఫాంట్ సైజ్ 12లో డిసెంబర్ 5వ తేది నుండి పోలింగ్ తేదీకి రెండు ముందు 5వ తేది లోపు ప్రచురించాలని డీఈ పేర్కోన్నారు. అలాగే టీవీ చానళ్ళలో కూడా ఆయా వివరాలను ఫారం-సీ2) ఆయా తేదీలలో వారి ఖర్చులతోనే ప్రసారం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆయా విధంగా ఫారం సీ1, సీ2లను అభ్యర్ధులు తమ ఖర్చుతో ప్రచురితం చేయనట్లైతే సంబంధిత రిటర్నింగ్ అధికారి నోటీసు ఫారం సీ3 జారీ చేస్తారన్నారు. దీనికి సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నామినేషన్ ప్రారంభానికి ముందే తాము తెలిపామని, అదే నామపత్రం వెంట ఆయా ఫారాలను అభ్యర్ధులకు ఆర్‌ఓలు తెలియజేశారని తెలిపారు. జిల్లా పౌరసంబంధాల అధికారి నివేదిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎక్కువ సర్కులేషన్ వార్తా ప్రతికలు, అలాగే ఎక్కువగా వీక్షకులు కలిగిన ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లకు ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తియిన తారువాత ఫారం సీ1, సీ2లను వార్తా పత్రికల్లో ప్రచురితం చేసిన విషయాన్ని ధృవీకరిస్తూ అభ్యర్ధులు ఫారం సీ4ను డిక్లరేషన్‌ను విధిగా సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 78 ప్రకారం సమర్పించే ఎన్నికల వ్యయ రిజిస్టర్‌తో సహా వార్తా పత్రికల్లో ప్రచురించిన పత్రులను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని కోరారు. పోటీ చేసే అభ్యర్దులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు గమనించి వ్యవహరించాలని డీఈవో హరిత కోరారు.