వరంగల్

క్రాస్ ఓటింగ్ ఎవరికొంప ముంచేనో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 7: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో అభ్యర్ధులతో పాటు పార్టీల నాయకులు గెలుపోటములపై పోస్ట్‌మార్టం నిర్వహించే పనిలో పడ్డారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో తొలుత బహుముఖ పోరు తప్పదనే ప్రచారం సాగినా.. చివరకు అధికార టీఆర్‌ఎస్, ప్రజాకూటమి అభ్యర్ధుల మద్యే ప్రధాన పోరుగా మారిందనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 217303 ఓట్లుండగా, ఎన్నికల్లో 184127 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 4 శాతం అధికంగా ఓట్లు పోలవడం విశేషం. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి బానోత్ శంకర్‌నాయక్‌కు 78,730 ఓట్లు సాధించి విజయం సాధించగా, 69,055 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్ధి మాలో త్ కవిత పరాజయం పాలయ్యారు. ఈసారి గత ఎన్నికల్లో మాదిరిగా 80 వేలకు పైగా ఓట్లు పొందిన అభ్యర్ధి ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరుగుతుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. దీనితో గత ఎన్నికల పోలింగ్ సరళిని.. ఈసారి జరిగిన ఓటింగ్ సరళి చిట్టాలను ముందేసుకొని రాజకీయ పార్టీల నాయకులు తమకు ఎక్కడెక్కడ ప్లస్ అవుతుం ది.. ఎక్కడెక్కడ మైనస్ అవుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు. కాగా ముందుగా అధికార టీఆర్‌ఎస్, ప్రజాకూటమి తో పాటు బీజేపీ, బీఎల్‌ఎఫ్ అభ్యర్ధుల మద్య పోరుంటుందని భావించారు. అయితే పోలింగ్ రోజునాటికి టీఆర్‌ఎస్, ప్రజాకూటమి అభ్యర్ధుల మద్యే ప్రధాన పోటీగా మారిందనే ప్రచారం సాగింది. అయితే బీజేపీ, బీఎల్‌ఎఫ్ అభ్యర్ధుల ప్రభావం కొన్ని చోట్ల ఉందని, మరికొన్ని చోట్ల అంతగా లేద నే ప్రచారం సాగుతోంది. దీనితో పలు చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ భరి లో లేకపోవడంతో పాటు టీడీపీ అభ్యర్ధి భరిలో ఉన్నా కొంత క్యాడర్ సహకరించకుండా టీఆర్‌ఎస్ అభ్యర్ధికి సహకరించడంతో శంకర్‌నాయక్‌కు తెలంగాణ సెంటిమెంట్ తోడై గెలుపు సునాయసమయ్యిందనే ప్రచారం సాగింది. ఈ సారి అలా కాకుండా టీడీపీ నుండి ముందుగానే బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి వర్గీయులుగా కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి ప్రజాకూటమిగా ఏర్పడటంతో ఈసారి టీఆర్‌ఎస్‌కు కొంత ‘ఎఫెక్ట్’ చూపే అవకాశం ఉందంటున్నారు. అయితే అటు బీఎల్‌ఎఫ్, ఇటు బీజేపీ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా అధికార టీఆర్‌ఎస్‌కు క్రాస్ అయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇదే తరహాలో కొన్ని చోట్ల టీఆర్‌ఎస్, బీజేపీ ఓట్లు సైతం కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు ప్రచారం సాగుతోంది.

‘నేనుసైతం’ సుమకు అటవీశాఖ అధికారుల ప్రశంస
మహబూబాబాద్, డిసెంబర్ 8: ప్రమాదాలకు గురైన, అక్రమ విక్రయాలకు లోనైన ముగజీవాలను కాపాడుకున్న నేనుసైతం స్వచ్ఛందసేవా సంస్థ సభ్యురాలు మహ్మద్ సుమ సేవలు స్పూర్తిదాయకం అని ఎఫ్‌జివో పి.కృష్ణమాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనదర్శిని కార్యక్రమాన్ని అన్నిశాఖలను సమన్వయం చేసి విజయవంతం చేసినందుకు గాను ఆయన సుమను సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవవైవిద్యాన్ని కాపాడుకోవడంతోనే మానవ మనుగడ కొనసాగుతున్నందున సుమను విద్యార్థులందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ సన్ని, డిఆర్‌డివో అంజలి, బీట్ ఆఫీసర్ ఎల్.రవీందర్, ట్వింకిల్‌స్టార్ హైస్కూల్ యాజమాన్యులు వడ్డెపల్లి సారంగపాణి, సునితాదేవి, అటవీశాఖ సిబ్బంది రమేష్, దామోదర్, అశోక్, వీరన్న పాల్గొన్నారు.