వరంగల్

టీఆర్‌ఎస్ గాలి వీస్తుందని ముందే చెప్పా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 11: తెలంగాణలో టీఆర్‌ఎస్ గాలీ వీస్తుందని తాను ముం దే చెప్పానని, అనుకున్నట్టుగానే టీఆర్‌ఎస్ ప్రభంజనంలో ప్రతి పక్ష పార్టీల అడ్రాస్ గల్లంతైందని డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ వాసులకు మానస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటునే గెలిచిన అభ్యర్ధులకు ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అని ప్రజలు నమ్మారనే దానికి ఈ ఫలితాలే నిదర్శనం అని అన్నారు. వరంగల్ జిల్లాకు ఉన్న సమున్నత, చారిత్రిక ఔన్నత్యాన్ని కాపాడాలంటే, ఈ జిల్లా గొప్పతనాన్ని ఇనుమడించలాంటే జిల్లాలోని రౌడీలను, గుండాలను, భూ కబ్జాదారులను ఓడించాలని ఇచ్చిన పిలుపును అందుకుని మా వెంట కొండంత అండగా నిలబడిన వరంగల్ ప్రజానీకానికి ప్రత్యేక వందనాలు తెలిపారు. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు ఇక్కడికి వస్తే తెలంగాణకు నష్టమని గ్రహించే, ఆంద్రపక్షాపతి చంద్రబాబును భూజాల మీద మోసుకొస్తున్న బుద్దిలేని దద్దమ కాంగ్రెస్ నేతలకు వరంగల్ వాసులు ఇచ్చిన ప్రజల తీర్పు చారిత్రాత్మకం అన్నారు. టీ ఆర్ ఎస్‌పై ఉంచిన విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన మాపై మరింత బాధ్యత పెంచిదన్నారు. ప్రజల నమ్మకాన్ని నూటికి నూరుపాళ్లు నిలబెట్టేవిధంగా కష్టపడి పనిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడుతామని అన్నారు. వరంగల్‌ను హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, సహకారంతో సమీష్టిగా పనిచేస్తామన్నారు.