వరంగల్

మేయర్ ఎమ్మెల్యే బన్‌గయా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 11: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యే అయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి టీ ఆర్ ఎస్ అభ్యర్ధిగా నన్నపునేని నరేందర్ పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రపై ఘన విజయం సాధించారు. దీంతో వరంగల్ మేయర్ పదవి ఖాళీ అయినట్లే. అయన నేడో, రేపే మేయర్ పదవికి రాజీనామ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఇక కార్పోరేటర్ల దృష్టి మేయర్ పదవిపై పడింది. దీని కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ కార్పోరేటర్లు ఉండడంతో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వారికే మేయర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో కార్పోరేటర్లు వారి వారి గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు వేగం చేస్తున్నారు. మరి ఈ కీలకమైన ఓరుగల్లు పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

ప్రజా కూటమి అంచనాలు తలకిందులు

వరంగల్, డిసెంబర్ 11: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా కూటమి అం చనాలు తలకిందులు అయ్యాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ స్ధానాల్లో మెజా ర్టీ నియోజకవర్గాల్లో తామే గెలుస్తామన్న ధీమాలో ఉన్న ప్రజా కూటమికి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. పోలింగ్ సరళి కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికి సైలెంట్ ఓటింగ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ఎం త చెప్పిన ప్రజలు మాత్రం టీఆర్ ఎస్ పథకాలకే పట్టం కట్టారు. మహాకూట మి పొత్తులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణ పరిధిలో ఉన్న వరంగల్ పశ్చిమలో టీడీపీ అభ్యర్ధి రేవూరి ప్రకాష్‌రెడ్డి పోటీలో ఉండడం అసక్తి రేపింది. సైకిల్ గుర్తును ప్రజలు ఇక్కడ ఎప్పుడో మర్చిపోయారని టీ ఆర్‌ఎస్ నాయకులు చేసిన ప్రచారానికి ఓటర్లు స్పందించారు. ఇక్కడ టీడీపీ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్లైనని చెప్పడంతో ప్రజలు అప్రమత్తమైయ్యారు. ఇక్కడ తక్కువ పోలింగ్ శాతం నమోదు అయినప్పటికి టీఆర్‌ఎస్ అభ్యర్ధి దాస్యం వినయ్‌భాస్కర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులపై వ్యతిరేఖత ఉన్నప్పటికి ప్రభుత్వ పథకాల ముందు లెక్కకు రాలేదు. 2014లో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో చేసిన తప్పులే ఈ సారి కూడా చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసినట్లైతే ఫలితాలు మరోలాగ ఉండేవని అభిప్రాయపడుతున్నారు. మహాకూటమి పొత్తే కాంగ్రెస్‌ను నిండా ముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే కారు జోరు కొనసాగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్ నాలుగు జిల్లాల్లోని పది నియోజకవర్గాలకు పది నియోజవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధులు విజయభావుట ఎగరవేశారు. అయితే ఓటమి పాలైన ఈ రెండు నియోజకవర్గాల్లో ములుగులో మంత్రి చందులాల్, భూపాలపల్లిలో స్పీకర్ మధుసూధనాచారి ఓటమి పాలవడం కొసమెరుపు.