వరంగల్

జయశంకర్ జిల్లాలో కాంగ్రెస్ జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, డిసెంబర్ 11 : ముందస్తు ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ అభ్యర్థులే అన్ని రౌండ్లలో పై చేయి సాధించారు. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజక వర్గాల్లో టీ ఆర్ ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మంత్రి చందూలాల్‌లు ఓటమి పాలయ్యారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి పార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావుపై 14,729 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గండ్ర వెంకటరమణారెడ్డికి 67,309 ఓట్లు రాగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావుకు 52,580 ఓట్లు పోలైనాయి. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి టీ ఆర్ ఎస్ నుండి బరిలో దిగగా 51,952 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్పీకర్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి 15,296 ఓట్లు సాధించి నాల్గో స్థానంలో నిలిచారు. అదేవిధంగా మంథని నియోజక వర్గంలో దుద్దిల్ల శ్రీ్ధర్‌బాబు టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబుకు 88,469 ఓట్లు రాగా టీ ఆర్ ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 72,681 ఓట్లు పోలైనాయి. పుట్ట మధుపై శ్రీ్ధర్‌బాబు 15,908 ఓట్లతో గెలుపొందారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి సీతక్క బరిలో ఉండగా టీ ఆర్ ఎస్ నుండి మంత్రి చందూలాల్ బరిలో నిలిచారు. సీతక్క మొదటి రౌండ్ నుండి చందూలాల్‌పై పై చేయి సాధిస్తూ వచ్చారు. ఆమెకు 88,950 ఓట్లు రాగా చందూలాల్‌కు 66,291 ఓట్లు పోలయ్యాయి. చందూలాల్‌పై 22,659 ఆధిక్యంతో సీతక్క గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మహా కూటమి అభ్యర్థి పొదెం వీరయ్య విజయ ఢంకా మోగించారు. మహా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పొదెం వీరయ్యకు 45,987 ఓట్లు రాగా టీ ఆర్ ఎస్ నుండి పోటీలో ఉన్న చల్లా వెంకట్రావుకు 34,864 ఓట్లు పోలయ్యాయి. వెంకట్రావుపై పొదెం వీరయ్య 11,123 ఓట్ల మెజార్టితో గెలుపొందారు. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజక వర్గాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలోని మంథని, భద్రాచలంలో కూడా కాంగ్రెస్ పై చేయి సాధించింది.

అభివృద్ధితోనే మా గెలుపు: చల్లా
పరకాల, డిసెంబర్ 11: కేసిఆర్ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పార్టీలకతీతంగా పారదర్శకంగా ప్రజలకు అందించడం వల్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగిందని పరకాల ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేను ఆసుపత్రికి వెళ్లితే మెడ నరాలు తెగినాయని మాట్లాడినారని అప్పుడే చెప్పాను డిసెంబర్ 11న ఏవరి నరాలు తెగుతాయో తెలుస్తుందని చెప్పానన్నారు. కేసిఆర్ క్షమించి మీకు అవకాశం ఇస్తే తిన్న చోటే కాల్చే రకం అన్నారు. వాళ్లు వచ్చి ఒరగపెట్టింది ఏమి లేదన్నారు.

ప్రతి రౌండ్‌లో అధిక్యత కనబర్చిన చల్లా
పరకాల, డిసెంబర్ 11: పరకాల చల్లాదే. తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన చల్లా ధర్మారెడ్డి వైపే పరకాల ప్రజలు మొగ్గు చూపారు. కారు గుర్తుకు ఓటు వేసిన ప్రజలు చల్లా ధర్మారెడ్డికి 46,519 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే పరకాల అసెంబ్లీ నుండి రెండవ సారి గెలిచిన వారు లేరని కానీ ఆ రికార్డును తిరగరాస్తు పరకాల అసెంబ్లీ సెగ్మంట్ నుండి చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో రెండవ సారి విజయం సాధించారు. పరకాల నియోజకవర్గం నుం డి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిల మద్య పోటీ తీవ్రంగా ఉండగా చివరికి విజయం చల్లా ధర్మారెడ్డికే దక్కింది.

అధికార దుర్వినియోగంతో గెలుస్తున్నారు
*పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ
పరకాల, డిసెంబర్ 11: ఈరోజును బ్లాక్‌డేగా అభివర్ణించ వచ్చునని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. మంగళవారం విలేకరులతో కొండా సురే ఖ మాట్లాడుతూ డబ్బులు, మద్యం పంపిణీ చేశారని, అధికార దుర్వినియోగంతో గెలుస్తున్నారని అన్నారు. 4 సంవత్సరాలలో అనేక రేట్లు నష్టపరిచారని, లక్షల కోట్ల అప్పులు తీసుక వచ్చి అప్పుల తెలంగాణగా తీర్చిదిద్దారని చెప్పారు. 4 సంవత్సరాలలో విస్మరించిన వాటిని విస్మరించకుండా ప్రజల పక్షాన నిలబడి పాలన అందించాలన్నారు. తెలంగాణ ప్రజలు ఏం నష్టపోతారనే బాధగా ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది... మాలాంటి నాయకులకు ఇబ్బందులన్నారు. ఎన్నికల సమయంలో మీరు మాట్లాడారు మేం మాట్లాడినామని దానిని తీసుకొని మళ్లీ అధికార దుర్వినియోగంతో దాడులు చెప్పించడం కానీ కేసులు పెట్టించడం కానీ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి మంచి పాలన అందించాలన్నారు.

గోదావరితో హుస్నాబాద్ సస్యశామలం
*ఎమ్మెల్యే సతీష్‌కుమార్ వెల్లడి
భీమదేవరపల్లి, డిసెంబర్ 11 : గోదావ రి నది జలలాతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి అదిస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్ధి సతీష్ పేర్కొన్నారు. మంగళవారం ముల్కనూరుకు వచ్చిన ఎమ్మెల్యేను ఎంపీపీ సంగ సంపత్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగ రవీందర్, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షులు సయ్యద్ షరీఫద్దిన్ పూల మాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విలేకరులతో సతీష్‌కుమార్ మాట్లాడుతూ జూన్ మాసంలోగా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి లక్షలాది ఎకరాలకు సాగునీటికి అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కేవలం కేసీ ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే ప్రతి ఒక్క అభ్యర్ధి గెలిచారన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేకున్న ప్రభుత్వం రైతుల కోరకు రైతుబీమా, రైతుబందు పథకం ప్రవేశపెట్టిందన్నారు. హుస్నాబాద్‌లో ప్రతి ఎకరాకు నీటిని అధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఓప్పించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసర పెన్షన్‌తో ప్రతి కుటుంబం ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిందన్నారు.రానున్న రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన పనులన్ని పూర్తి చేసి ప్రతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు.

అంబరాన్నంటిన సంబరాలు
*టీఆర్‌ఎస్ జోష్ * కాంగ్రెస్, బీజేపీలో నిరాశ

వరంగల్, డిసెంబర్ 11: ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ సంబరాలు అంబరాని తాకాయి. అసెంబ్లీ ఫలితాల్లో ప్రజలు టీ ఆర్ ఎస్‌కు పట్టం కట్టడంతో టీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితెలారు. నగరంలోని ఏనుమాముల మార్కెట్‌లో వరంగల్ పశ్చిమ, తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల పార్టీ శ్రేణులు ఫలితాల కోసం మార్కెట్ బయటనే వేచియున్నారు. ఒక్కోక్క ఫలితాలు భయటకు రావడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఏనుమాముల మార్కెట్ గోదాంలో లెక్కిస్తున్న ఐదు నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్ధులే గెలుపొందండంతో గులాబీ జెండా రెపరెపలాడింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆ ప్రాంతంలో కనిపించకుండానే నిష్కక్రమించారు. వరంగల్ పశ్చిమనుండి గెలుపొందిన దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు నుండి గెలుపొందిన నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట నుండి గెలుపొందిన ఆరూరి రమేష్, పరకాల నుండి గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట నుండి గెలుపొందిన పెద్ది సుదర్శన్‌రెడ్డిలను వారి వారి కార్యకర్తలు, అభిమానులు గులాబీ రంగులో ముంచేశారు. భారీ ర్యాలీలతో హోరెత్తించారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట పట్టణాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ అర్బన్ , రూరల్ , జనగామ, మహబూబాబాద్ జిల్లాలో మొత్తనికి మొత్తం అన్ని స్ధానాలలో టీఆర్‌ఎస్ అభ్యర్ధులే గెలుపొందడంతో కార్యకర్తల సంబరాలు మిన్నంటి పోయాయి. భూపాలపల్లి జిల్లాకే కాంగ్రెస్ కార్యకర్తలు పరిమితమైయారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.