వరంగల్

నిరుద్యోగులకు 3 నెలలు ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, డిసెంబర్ 14: నిరుద్యోగులకు మూడు నెలల పాటు వృత్తివిద్య కోర్సులలో శిక్షణ ఇప్పించి వారికి జీవనోపాది మార్గం చూపించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ జిల్లా కో- ఆర్డినేటర్ చింతరవి తెలిపారు. శుక్రవారం ఆయన జనగామలో విలేకరులతో మాట్లాడుతూ శిక్షణకు సంబందించిన వివరాలను తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవల్‌ప్‌మెంట్ మిషన్‌చే ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తివిద్యలో మూడు నెలల పాటు స్వల్పకాలిక శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. 18సంవత్సరాలు పూర్తయి 35సంవత్సరాలలోపు ఉన్న 10వ తరగతి నుండి ఆ పైన చదివిన వారు తమ పేర్లను నమోదు చేసుకొని శిక్షణ పొందాలని కోరారు. బ్యుటీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్స్ రంగాల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారికి స్కిల్ డెవల్‌ప్‌మెంట్ మిషన్‌ద్వారా దృవీకరణ పత్రాలు ఇస్తారని అన్నారు. మూడు నెలల పాటు శిక్షణ పొందే యువతి, యువకులకు హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని అన్నారు. అలాగే యునిఫామ్, బుక్స్, సెల్‌ఫోన్ ట్యాబ్‌లు అందచేస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 20వ తేదీలోగా 8297316451, 8142554665 సెల్ నంబర్లకు డయల్‌చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిథి స్వప్న పాల్గొన్నారు.

అడవిలో పొంచి ఉన్న ఆపద
భూపాలపల్లి అడవుల్లో మూగజీవాల విచ్చలవిడి వేట..
తీగలవాగు వెంట 6కి.మీ మేర విద్యుత్ తీగలు
పశువుల కాపరి మృతితో బయటపడుతున్న నిజాలు
చోద్యం చూస్తున్న అటవీశాఖ అధికారులు
భూపాలపల్లి, డిసెంబర్14: భూపాలపల్లి అడువుల్లో ఉన్న మూగ జీవాలు ఆపదలో ఉన్నాయి. వేటగాళ్ళ విద్యుత్ తీగల ఉచ్చుల్లో పడి విలవిలలాడుతున్నాయి. భూపాలపల్లి సమీప అడవులైన బాంబుల గడ్డ, తీగలవాగు వెంట 6 కిలోమీటర్ల మేర అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశా రు. వాగు వెంట ఉన్న చెట్లను ఆసరా చేసుకోవడంతో పాటు కొన్ని చోట్ల కర్రలను పాతి 11 కేవీ లైన్ ద్వారా జంతువులకు విద్యుత్ షాక్ తగిలేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో కాలం గా అడవి జంతువులను విచ్చలవిడిగా స్మగ్లర్లు వేటాడుతు న్నా అటివి శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అటవీ సిబ్బందిని మచ్చిక చేసుకొని విచక్షణరహితంగా జంతువులను వేటాడుతున్నారు. వాగు వెంట నీరు తాగేందుకు వచ్చే అడివిపందులు, అడవి దున్నలు కుందేళ్ళు విద్యుత్ తీగలు తగిలి మృత్యు వాత పడుతున్నా యి. జంతవులతో పాటు తాజాగా భూపాలపల్లి మండలం గడ్డిగానిపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి దుర్గం అంకయ్య వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి అకారణంగా మృత్యు వాత పడ్డాడు. అడవిలోకి వెళ్ళే పశువుల కాపర్లు గొర్లకాపర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవిలో తిరగాల్సి వస్తుంది. అంకయ్య మృతితో వేటగాళ్ళ వ్యవహారం బయటపడింది.ఏళ్ళ తరబడి జంతువుల వేట కొనసాగుతున్నా అటవీ శాఖ అధికారులు మామూళ్ళ మత్తులు తూగుతున్నారు. మూగ జీవాలతో పాటు మనుషుల ప్రాణాలను తీస్తున్న వేటగాళ్ళపై చర్యలు తీసుకోవాలని రైతులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు
* కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ రవీందర్‌రావు
నర్సంపేట, డిసెంబర్ 14: నర్సంపేటలో గెలిచామని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులపై భౌతికదాడులకు దిగుతున్నారని, తక్షణమే దాడులకు స్వస్తి పలకకపోతే తగిన బుద్ది చెబుతామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు హెచ్చరించారు. ఖానాపురం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రవీందర్‌రావు మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకున్నారని, అయితే గెలిచామనే అహంకారంతో కొన్ని గ్రామాలలో దాడులకు దిగడం సరి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తానా చాటి చెపుతామని స్పష్టం చేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములను కాంగ్రెస్ పార్టీ సహజంగానే స్వీకరిస్తుందని, ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసి, రాబోయే రోజులలో టీఆర్‌ఎస్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి కోరుతుందని చెప్పారు. ఓటమితో కాంగ్రెస్ శ్రేణులంతా కుంగిపోవద్దని, పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాల్సిందిగా కోరారు. ఈవిలేఖరుల సమావేశంలో జడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, శాఖమూరి హరిబాబు, వీరమనేని సాగర్, తక్కళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తిని సస్యశ్యామలం చేస్తా..
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి, డిసెంబర్ 14: నామీద ఎంతో నమ్మకంతో అఖండ మెజార్టీతో గెలిపించిన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సేవకుడిలా పనిచేస్తూ ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఎన్నికలలో గెలిచి మొదటిసారిగా విచ్చేసిన దయాకర్‌రావుకు ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్య లో నిరాజనాలు పలుకుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రజలు ముఖ్యమంత్రి కేసీ ఆర్‌పై నమ్మకంతో, నాపై ఉన్న మమకారంతో అఖండ మెజార్టీతో నన్ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలందరికి రుణపడి ఉంటానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వగానే గోదావరి జలాలను తీసుకువచ్చి పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులన్నిటిని నింపి చెరువులు మత్తడి పడేలా చేస్తానని ఆయన అన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో ఉంచుతానని అన్నారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే తెరాసను భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. మూడు దశబ్ధాలుగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నాకు వెన్నంటే ఉండి నన్ను బలపరుస్తున్నారని వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని అన్నారు. కార్యకర్తలు గెలిచామని గర్వం ఉండకుండా గ్రామాలలో అభివృద్ధి పనులను చేయాలని అన్నారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా కార్యకర్తలు చొరువ చూపాలని అన్నారు. నాపై మమకారంతో గత 30 సంవత్సరాలుగా అదరిస్తున్న రాయపర్తి మండల ప్రజలను ఏనాడు మరిచిపోనని, ఇది నా సొంత మండలంగా భావిస్తున్నానని అన్నారు. యువతకు పెద్దపీట వేసి, యువకులలోని సృజనాత్మకతను గుర్తించి వారికి కంపెనీలలో ఉద్యోగం వచ్చేలా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మం డల నాయకులు ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ వంగాల యాకమ్మ, నాయకులు అనీమిరెడ్డి, గోపాల్‌రావు, నర్సింహానాయక్, సురేందర్‌రావు పాల్గొన్నారు.