వరంగల్

రైల్వేలు, జాతీయ రహదారులకు భూసేకరణ జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 27: రైల్వేలు, జాతీయ రహదారుల విస్తరణకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలకు అప్పగించనునట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్‌కే జోషి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశములకు అనుగుణంగా వృద్దాప్య పింఛన్ల లబ్దిదారుల ఎంపికకై 64 సంవత్సరాల నుండి 57 సంవత్సరముల వయస్సు ఉన్న వారిని గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వారిగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమీషనర్‌చే ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్‌కే జోషి మాట్లాడుతూ కొత్తగా అర్హత పొందిన వృద్దాప్య ఫింఛన్ లబ్దిదారుల జాబితాను గ్రామ సభల ఆమోదం తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా పనులను వేగంగా పూర్తి చేసేందుకు నిర్ధేశిత సమయంలోపు పూర్తి చేయాలని తెలిపారు. రెవెన్యూ అటవీ భూముల వివాదాలను పరిష్కరించుటకు ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయితీ వార్డుల రిజర్వేషన్లను నిబందనల ప్రకారం చేపట్లాని తెలిపారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నియామాలకు ఎక్స్ సర్వీస్‌మెన్, క్రీడల కోటా క్రింద దరఖాస్తు చేసిన అభ్యర్ధుల సర్ట్ఫికెట్లను సంబంధిత అధికారులచే పరిశీలింపచేసి ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ యస్ దయానంద్, ఆర్డీవో వెంకారెడ్డి, డీ ఆర్‌డీవో రాము, డి ఎఫ్‌వో పురుషోత్తం, డీపీవో మహముద్ తదితరులు పాల్గొన్నారు.