వరంగల్

పారదర్శకంగా కారుణ్య నియమకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 27: పారదర్శకంగా కారుణ్య నియమకాలు, పదోన్నతులు చేపడతామని వరంగల్ బల్దియా కమీషనర్ వీ.పీ. గౌతమ్ అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో అదనపు కమీషనర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారుణ్య నియమకాలకు సంబంధించి సదరు కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సర్ట్ఫికెట్లు తీసుకోవాలన్నారు. సానిటరీ ఇన్ స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, జూనియర్ సహాయకులు పదోన్నతులకు సంబంధించి చేపట్టే ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు కారణ్య నయమకాలకు సంబంధించి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో 4 పోస్టుల నియమకానికి అనుమతించగా మరో 4 పోస్టులకు సంబంధించి సంబంధిత కుటుంబ సభ్యులను తన ముందు హాజరు పరిచి వారి అభిప్రాయాలు తెలియజేయాలని బల్దియా కమీషనర్ అన్నారు. 2 పోస్టులకు సంబంధించి మెడికల్ అనర్హత ఉన్నందున పున:పరిశీలనకు ఎంజీఎంకు పంపాలని కమీషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సిహెచ్ నాగేశ్వర్, సూపరింటెండ్ ప్రసన్నరాణి పాల్గొన్నారు.
తండాలను వెంకటాపూర్ మండలంలో కలపాలి
* కలెక్టర్‌కు ఎమ్మెల్యే సీతక్క వినతి
ములుగు టౌన్, డిసెంబర్ 27 : వెంకటాపురం మండలం పెద్దాపూర్ రెవెన్యూ కింద ఉన్న గుర్రంపేట రాంనాయక్ తండా, సుబ్బక్కపల్లి, బావుసింగ్‌పల్లి గ్రామాలను వెంకటాపూర్ మండలంలో కలపాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం గ్రామస్తులతో కలిసి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంబంధిత గ్రామాలను వెంకటాపురం మండలంలో కలిపితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన సీతక్క
ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క గురువారం జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
కేయూలో మొక్కల
రోగ నిర్ధారణపై సదస్సు
కేయు క్యాంపస్, డిసెంబర్ 27: కాకతీయ విశ్వవిద్యాల యం మైక్రో బయాలజీ విభాగము రజితోత్సవంలో భాగంగా ఆ విభాగము న్యూడీల్లీ ఇండియన్ పైటో పెథాలజీకల్ సోసైటి సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 28న ఒక రోజు జాతీయ సదస్సు, రిసెంట్ టైండ్స్ ఇన్‌ప్లాంటీ డీసీజ్ మేనేజ్‌మెంట్ అనే అంశంపై నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సా యన్న హాజరువుతుండగా డాక్టర్ జయశంకర్ తెలంగాణ రా ష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉపకులపతి ఆచార్య వీ ప్రవీన్‌రావు కీలోకపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమం లో ప్రారంభ సమావేశానికి అధ్యక్షులుగా విశ్రాంతచార్యులు ఏమిరైటస్ ఆచార్య యస్‌యం రెడ్డి వ్యవహరిస్తారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
*ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్
కాజీపేట, డిసెంబర్ 27: పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. గురువారం కాజీపేట 35వ డివిజన్ టీ ఆర్ ఎస్ మహిళా కార్యకర్తలు,టీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్ నాయకత్వంలో ఎమ్మెల్యే వినయభాస్కర్‌ను కలిసారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నార్లగిరి రమేష్ 34,35,53 డివిజన్లలోని స్లమ్‌ల్లో నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని, ఆ డివిజన్లలోని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విన్నవించారు. ఈ విన్నపాలకు స్పందించిన ఎమ్మెల్యే వినయభాస్కర్ 34,35,53 డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు కొనసాగించాలి
ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి * సీపీఎం డిమాండ్
వడ్డేపల్లి, డిసెంబర్ 27: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోగతంలో బిసిలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూ, బిసిలను ఎబిసిడిఇలుగా వర్గీకరించాలని, ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిల రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఆచార్య జయశంకర్ స్మృతివనం ఎదుట సిపిఎం అధ్వర్యంలోధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాసుదేవరెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ నెలలో శాసనసభకు జరిగిన ఎన్నికలలో బిసిల ఓట్లతో గెలిచి గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వం బిసిలను రాజకీయంగా అణగదొక్కడానికి రిజర్వేషన్లను తగ్గించడం దారుణమని మండిపడ్డారు. మన పక్కరాష్టమ్రైన తమిళనాడులో స్థానిక సంస్థలలో బిసిలకు 69శాతం రిజర్వేషన్లు కేటాయించినా, ప్రశ్నించని సుప్రీం కోర్టు తెలంగాణ రాష్ట్రంలోనే బిసిలకు రిజర్వేషన్లు తగ్గించమని చెప్పిందా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సకల జనుల సర్వే ప్రభుత్వం వద్ద ఉన్నా అన్ని కులాల జనాభా గణాంకాలను సుప్రీం కోర్టుకు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చెయడమే ఈ పరిస్థితికి కారణం అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా బిసిలకు స్థానిక సంస్థలలో 34శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. బిసిలకు కొనసాగుతున్న 34శాతం రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించి ఆర్డినెన్స్ తేవడం వలన బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి రిజర్వేషన్ల అంశమే కాకుండా రాబోయే రోజులలో అన్ని రిజర్వేషన్లను ఎత్తివేయాలనే భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని, ఈ విధమైన ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు ఉప్పలయ్య, ప్రభాకర్‌రెడ్డి, రమేష్, రాంబాబు, రత్నమాల, లింగయ్య, కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.