వరంగల్

ఆలస్యం కావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/మహదేవ్‌పూర్, జనవరి 2: కాళేశ్వ రం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండో రోజు ముఖ్యమంత్రి పర్యటన అన్నారం బ్యారేజి వద్ద కొనసాగింది. ఉదయం 11 : 30 నిమిషాలకు కరీంనగర్ నుండి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా కనె్నపల్లి పంప్‌హౌజ్‌కు చేరుకున్నారు. మొదట కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థాన చైర్మన్, ఆలయ అర్చకులు శాలువాలతో ముఖ్యమంత్రిని సన్మానించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పంప్‌హౌజ్ నుండి గ్రావిటి కెనాల్‌కు అటవీ మార్గం గుండా సీఎం 13 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో సీఎం ప్రయాణించారు. కాల్వ పనులను పరిశీలించిన ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 13 కిలోమీటర్ల పొడవున 29 స్టెక్చర్లు ఉన్నాయని, ఇరుపక్కల కాంక్రీటుతో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసిన అప్కాన్ కంపెనీ ఇం జనీరింగ్ అధికారులను సీఎం అభినందించారు. అనంతరం సీఎం అధికారులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల బీడు భూమి సాగులోకి రావడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మార్చి 31 నాటి కి వందశాతం పూర్తి చేయాలని, అందుకు అధికారులు, నిర్మాణ సంస్థలు అంకిత భావంతో పని చేయాలన్నారు. కనె్నపల్లి పంప్‌హౌజ్ నుండి అన్నారం బ్యారేజి వరకు నిర్మిస్తున్న గ్రావిటి కెనాల్ పనులలో కార్మికుల సంఖ్యను పెంచి మూడు షిప్ట్‌లలో పనులు కొనసాగించాలన్నారు. పనులు శాశ్వతంగా ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో పని చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అన్నారం బ్యారేజి పనులు చివరి దశలో ఉండటం తో సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇంజనీర్లను కూడా ఈ సందర్బంగా అభినందించారు. ప్రాజెక్టు వలన భూములు కోల్పోయిన దామెరకుంట రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు వివేక్, సీ ఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎం ఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎస్పీ ఆర్ భాస్కరన్, సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, ఆప్కా నిర్మాణ సంస్థ డైరెక్టర్ పరేట్కర్, భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి, కె ఎన్ ఎన్ రావు, మల్లిఖార్జున్‌రావు, శేఖర్‌దాస్, డీ ఈ ప్రకాశ్, సుధాకర్‌లతో పాటు కాళేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బొమ్మెర వెంకటేశం, ఈవో మారుతి తదితరులు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక ప్రచారం
అవాస్తవం
జిల్లా కేంద్రం తరలించవద్దనే సీఎంని కలిసా..: ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి, జనవరి 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని మరో చోటికి తరలించవద్దనే ఉద్దేశంతోనే జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మేడిగడ్డ పర్యటన సందర్బంగా కలవడం జరిగిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవడంలో వేరే ఇతర ఉద్దేశ్యాలేమి లేవని, జిల్లా కేంద్రం విషయంతో పాటు నియోజక వర్గంలో నూతనంగా ఏర్పాటు కావలసిన మండలాలు, గ్రామ పంచాయతీల విషయంపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించానన్నారు. అదేవిధంగా జిల్లాలో మరికొన్ని డివిజన్‌లు కూడా ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయ న సానుకూలంగా స్పందించారన్నారు. కొందరు అవగాహన లేని వ్యక్తులు తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. జిల్లా అభివృద్ది విషయంలో నియోజకవర్గంలో కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎం ని కలవడం తన బాధ్యతగా భావిస్తున్నానే తప్పా ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. తనపై నమ్మకంతో ఓట్లేసిన ప్రజల కోసం నిరంతరం పని చేస్తానే తప్పా పార్టీని మారే ప్రసక్తే లేదని ఆయ న అన్నారు. జిల్లా విషయంలో సానుకూలంగా స్పం దించిన ముఖ్యమంత్రికి ఆయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. మొగుళ్లపల్లికి సంబంధించిన ఓ అధికారి రిజర్వేషన్‌లలో తప్పులు చేశారని గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, చల్లూరి సమ్మయ్య, రాజిరెడ్డి, కటకం జనార్దన్, దార పూలమ్మ, రాజబాబు, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ మండీ టెండర్లు షురూ..
కేసముద్రం మార్కెట్లో ప్రయోగం సక్సెస్ * ‘ఆంధ్రభూమి’ వార్తకు స్పందన
కేసముద్రం, జనవరి 2: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అధికారులు ఇంటర్ మండీ టెండర్లు ప్రారంభించా రు. కేసముద్రం మార్కెట్లో ఏడాదిన్నర క్రితం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ (ఈనామ్) విధానం ప్రవేశపెట్టారు. ఈనామ్‌లో కేసముద్రంతో పాటు రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సైతం ఆన్‌లైన్ ద్వారా టెండర్లు వేసి ఇంటర్ మండీ విధానంలో వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఖరీదు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఇంటర్‌మండీ విధానాన్ని అనుసందానించకపోవడంతో ఇంత కాలంగా కేసముద్రం మార్కెట్లో లైసెన్స్ పొందిన వ్యాపారులు మాత్రమే సరుకులు ఖరీదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎక్స్‌లెన్సీ అవార్డు రేసులో కేసముద్రం మార్కెట్‌ను నిలిపేందుకు మార్కెటింగ్‌శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఈనామ్ అమలులో లోపాలపై ‘ఆంధ్రభూమి’లో గత ఆదివారం ప్రచురించిన కథనంపై అధికారుల్లో కదలిక వచ్చింది. అవార్డుకు ఎంపికవ్వాలంటే ఈనామ్‌లో ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయాల్సి ఉండటం తో ఉన్నతాధికారులు హుటాహుటిన ‘ఇంటర్‌మండీ’ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు ఇంటర్‌మండీ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ మార్కెట్లలో వ్యాపారం నిర్వహించే ట్రేడర్ల చేత పలు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయించారు. కేసముద్రం మార్కెట్లో వైఫై ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఈనామ్ టెండర్ హాల్ ఏర్పాటు చేశారు. అలాగే వ్యాపారులు నేరుగా టెండర్లు వేయడం, బిడ్డింగ్ ఓపెన్ చేసిన తరువాత విన్నర్ లీస్ట్ పరిశీలించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. దీనితో కేసముద్రం మార్కెట్లో వ్యాపారం నిర్వహించే ట్రేడర్లతో పాటు ఆయా ప్రాం తాల వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల ఖరీదులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. అయితే ఇది ‘నామ్’కే వాస్తేగా కాకుండా నిరంతరంగా సాగేలా చూస్తే వ్యాపారుల మద్య పోటీ పెరిగి రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయి. ఎడాదిన్నరగా ఈనామ్ అమలు చేస్తున్నా ఇంటర్ మండీ విధానాన్ని అమలు చేయడంలో మీనమేషాలు లెక్కించిన ఎట్టకేలకు ‘ఆంధ్రభూమి’ కథనంతో ఇంటర్‌మండీ ఆన్‌లైన్ టెండర్లు చేపట్టడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనామ్‌కు సాంకేతిక సహాకారం అందిస్తున్న ఎన్‌ఎఫ్‌సీఎల్ సంస్థ అధికారులతో మాట్లాడి ఇంటర్‌మండీ ప్రారంభానికి చర్యలు చేపట్టి, తొలుత ఈనామ్ అమలు చేస్తున్న సమీప మార్కెట్లను ప్రయోగాత్మకంగా అనుసందానించామని, ఈ ప్రయోగం సక్సెస్ అయినందున త్వరలో రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలోని వ్యాపారులతో మాట్లాడి వారిని కూడా ఇంటర్‌మండీలో చేరుస్తామని మార్కెట్ కార్యదర్శి మల్లేషం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.

13 నుంచి ఐనవోలు జాతర
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడండి: కలెక్టర్ ప్రశాంత్
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 2: ఈ నెల 13 నుండి నిర్వహించే ఐనవోలు జాతరకు తరలివచ్చే భక్తులకు సంతృప్తి కలిగే విధంగా పారిశుద్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం మల్లిఖార్జునస్వామి దేవస్ధానంలో 2019 సంవత్సరం బ్రహోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 10లోపు శాఖల వారిగా నిర్ధేశించిన పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ఆయా పనులను స్వయంగా పర్యవేక్షించాలని తెలిపారు. దేవస్ధానం అభివృద్ధికి చేపట్టిన డ్రైనేజీ, రోడ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు. హైద్రబాద్, వరంగల్, ఖమ్మం మార్గల నుండి వచ్చే భక్తుల సౌకర్ధ్యాం మరుగుదొడ్లు, మంచినీటి వసతి, వీదిలైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మహాశివరాత్రి, ఉగాది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 13న ఉత్సవాలు ప్రారంభంవుతాయని 15వ తేదిన మకర సంక్రాంతి సందర్భంగా రాత్రి ప్రభల బండ్లు తిరుగుతాయని, 17న మహాసంప్రోక్ష సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12 నుండి శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమీపంలోని మండలాల నుండి గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బందిని రప్పించాలని ఎంపీడీవోకు సూచించారు. అలాగే వరంగల్ మున్సిపాలిటి నుండి 70 మంది కార్మికులను, పర్యవేక్షకులను, రెండు స్వచ్చా ఆటోలను ఏర్పాటు చేయాలని తెలిపారు. బందోబస్తుకై మూడు ప్రాం తాలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పా టు చేయాలని చెప్పారు. భద్రతకై దేవస్ధానం పరిధిలో ఉన్న 30 సీసీ కెమెరాలను అదనంగా మరో 30 కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకా ర్ధ్యం తాత్కాలిక బస్టాండ్‌ను నెలకొల్పి 100 బస్సులను నడపాలని తెలిపారు. ఐనవోలుకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆయా డిపో మేనేజర్లు రిజనల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాల ని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఐనవోలు దేవస్ధానం ప్రాధాన్యత దృష్ట్యా శాశ్వత బాస్టాండ్ నిర్మాణాకి స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు అత్యవసర మందు లు, వైద్యులు, సిబ్బంది, 108వాహనంతో ప్రత్యేక వైద్య శిభిరాన్ని నిర్వహించాలని చెప్పారు. తాగునీటి ఎద్దటి రాకుండా మోబైల్ పార్టీని ఏర్పాటు చేసి ధర్మసాగర్‌నుండి వచ్చే నీటి పరిస్థితిని మానిటరింగ్ చేయించాలని తెలిపారు. అన్ని మార్గలలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ పరంగా కల్పించిన వసతులు, దారుల గురించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ మద్యం విక్రయాలను నిరోదించాలని తెలిపారు. జాతరను సందర్శించే భక్తుల సంఖ్యను లెక్కించుటకు ఎంట్రెన్స్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపీపీ, రవీందర్‌రావు, అన్ని శాఖల అధికారులు హాజరైయ్యారు. అంతకు ముందు పూర్ణకుంభ మంగళవాయిద్యాలతో ఆలయ అర్చకులు అధికారులు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు స్వాగతం పలికారు.

పరకాలను జిల్లా చేయాలి
పరకాల, జనవరి 2: పరకాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి పరకాల ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా న్యాయవాద జెఎసి చైర్మన్ ఓంటేరు రాజవౌళి మాట్లాడుతూ నిజాం రాజుల కాలం నుంచి పరకాల ఒక పెద్ద తాలుకా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్‌గా కొనసాగిందన్నారు. జిల్లాల పునర్విభజనలో పరకాలతో సమానవైన తాలుకాలైన మహబూబాబాద్, జనగాంను జిల్లాలుగా ఏర్పాటు చేసి పరకాలకు మాత్రం అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ సారి సీఎం ఎన్నికైన తరువాత అదనంగా రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని చెప్పారు. 20 మండలాలతో కూడిన భూపాలపల్లి జిల్లా నుండి ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా చేస్తున్నందున పరకాల డివిజన్‌ను భూపాలపల్లి జిల్లాలో కలిపి పరకాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మేరుగు శ్రీనివాస్, చంద్రవౌళి, వెంకటరమణ, బందెల స్వామి, తోట పరమేశ్వర్, రాజేందర్, రవికుమార్, మచ్చ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల కోడ్‌తో
సద్దిమూట ప్రారంభం వాయిదా
కేసముద్రం, జనవరి 2: కేసముద్రం మార్కెట్లో రైతులకు రాయితీపై మధ్యాహ్న భోజన పథకం ‘సద్దిమూట’ ప్రారంభం పంచాయతీ ఎన్నికల కోడ్‌తో వాయిదా వేసినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేషం తెలిపారు. హరేక్రిష్ణ ఫౌండేషన్, మార్కెట్ కమిటీ, దాతల సంయుక్త ఆధ్వర్యంలో నేటి (గురువారం)నుండి సద్దిమూట కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే ఆజ్మీరా సీతారాంనాయక్, బానోత్ శంకర్‌నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌తో పాటు కలెక్టర్ శివలింగయ్య, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు వాయిదా వేసినట్లు కార్యదర్శి తెలిపారు. అలాగే ప్రాధమిక ఆరోగ్య కేం ద్రం ప్రారంభం కూడా వాయిదా పడినట్లు ఆయన తెలిపారు.

‘పంచాయతీ’ పోటీకి నిబంధనలు ఇవే..
భూపాలపల్లి, జనవరి 2 : జరగనున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పకుండా నామినేషన్ పత్రాలలో వారి వివరాలను పూరించాలని చెబుతున్నారు.
21 సంవత్సరాలు నిండి ఉండాలి: పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే వారు 21 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. వీరు ఓటు హక్కు కలిగి ఉండాలి. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ప్రతిపాదిలు స్థానిక గ్రామ పంచాయతీలో ఓటు హక్కు కలిగి ఉండాలి. వార్డు సభ్యుడుని ప్రతిపాదించేవారు సంబంధిత వార్డులో ఓటరై ఉండాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి 1995 మే 31 నాటికి ముగ్గురు సంతానం ఉంటే అర్హునికి పరిగణిస్తారు. ఆ తరువాత సంవత్సరంలో ముగ్గురు సంతానం కలిగిన వారికి అనర్హునిగా పరిగణిస్తారు. పిల్లలను దత్తత ఇచ్చినప్పుడు ఆ పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందినవారుగానే గుర్తించబడుతారు.
పోటీ చేసేందుకు అర్హులెవరు..: రేషన్ డీలర్లు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. అంగన్‌వాడీలు మాత్రం పోటీకి అనర్హులు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు పోటీ చేయాలంటే నామినేషన్ దాఖలు చేసే నాటికి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వంచే ఆమోదించబడాలి. అలాగే నీటి వినియోగదారులు, సహకార సంఘాల సభ్యులు, స్వచ్చంద సంస్థలు, మత సంస్థల చైర్మన్‌లు పోటీకి అనర్హులు. ఆర్టీసి, సింగరేణి సంస్థలో పనిచేసే వారు కూడా అనర్హులుగానే పరిగణిస్తారు.
పూర్తి సమాచారం ఇవ్వాలి: ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు నామినేషన్‌తో పాటు వ్యక్తిగత సమాచార డిక్లరేషన్‌లో ఏదైనా సమాచారాన్ని దాచి ఉంచినా, తప్పుగా పేర్కొ న్నా తుది బరిలో నిలిచే అవకాశాన్ని మాత్రం కొత్త చట్టం కల్పించింది. దీనిని నిరూపిస్తూ రుజువులతో సహా ఎవరైనా అభ్యంతరం చెప్పినప్పటికి నామినేషన్‌లు తిరస్కరించడం జరగ దు. అయితే డిక్లరేషన్ పత్రాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించిన క్రమంలో ఆ సమాచారం తప్పని రిటర్నింగ్ అధికారి భావిస్తే స్థానిక కోర్టులో ఐపీసీ 177, సీ ఆర్ పీసీ 195 ప్రకారం స్థానిక కోర్టులో ఫిర్యాదు చేసే వీలుంటుంది. కానీ నామినేషన్ మాత్రం తొలగించబడదు. ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తులు నామినేష న్ వేసినట్లు ఆధారాలతో నిరూపిస్తే మాత్రం అనర్హత వేటు పడుతుంది. కాగా నామినేషన్ వేసిన వ్యక్తి ప్రతిపాదితులుగా ఉన్న వారి సంతకాలను ఫోర్జరి చేసినట్లు రిటర్నింగ్ అదికారి భావిస్తే నామినేషన్ తిరస్కరించే వీలుంటుంది.
నామినేషన్ వివరాలు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ అభ్యర్థులకు రిజర్వేషన్ విషయంలో రాయితీ ఉంటుంది. సర్పంచ్ పదవికి ఎస్సీ,ఎస్టీ, బీసీలు రూ. 1000, ఇతరులు రూ. 2వేలు చెల్లించాల్సి ఉంటుంది. వార్డుకు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. జనరల్ స్థానాల్లో కూడా ఇదే విధంగా వర్తిస్తుంది.
దోషిగా ఉండొద్దు: ఒక వ్యక్తి క్రిమినల్ కోర్టులో దోషిగా నిర్దారించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్ల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే వీలు లేదు. విచారణ అనంతరం దోషిగా నిర్దారించబడిన వ్యక్తి స్టే లేదా బెయిల్ పొందినప్పటికి ఎన్నికల్లో అనర్హుడిగానే గుర్తింపబడుతాడు.

పేదలందరికీ వంటగ్యాస్ కనెక్షన్‌లు
తెల్లరేషన్‌కార్డు ఉన్న వారంతా వినియోగించుకోవాలి: హెచ్‌పీ ఏరియా సెల్స్ మేనేజర్
మహబూబాబాద్, జనవరి 2: పేదలందరికి వంటగ్యాస్ కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఉజ్వలయోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ పథకాన్ని అర్హులందరు వినియోగించుకోవాలని హిందుస్థాన్ పెట్రోలియం ఏరియా సెల్స్‌మేనేజర్ జి.రాజ్‌కుమార్ అన్నారు. మహబూబాబాద్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. రూ.12,800 కోట్ల వ్యయంతో 5 కోట్ల మంది నిరుపేద లబ్ధిదారులకు వంటగ్యాస్ కనెక్షన్‌లు అందించే లక్ష్యంతో 2015లో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరు ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి అర్హులే అన్నారు. తమ ఆధార్‌కార్డులను సమీపంలోని హెచ్‌పి గ్యాస్ డిస్టిబ్యూటర్‌లకు చూపినట్లైతే వారిపేరుపై గతంలో గ్యాస్ కనెక్షన్ ఉందో లేదో చెబుతారన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనట్లైతే ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పొందే అవకాశం లభిస్తుందని తెలిపా రు. గ్యాస్ కనెక్షన్‌తోపాటు స్టౌవ్ కూడా అందజేస్తారని రాజ్‌కుమార్ చెప్పారు. 14.2కిలోల గ్యాస్ కనెక్షన్ ద్వారా సబ్సిడితో కలుపుకొని రూ.867 మాత్రమే ఉందని ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనివారికి ఉజ్వల స్కీమ్ కింద 5కిలోల సిలిండర్, రూ.350కి అందజేస్తామన్నారు. ఎమైన గ్యాస్ ప్రమాదం జరిగి మరణిస్తే వారికి రూ.6లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగితే యూనివర్సల్ నెంబర్ 1906కు ఫొన్ చేయాలని ఇతర సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 18002666696కు ఫొన్‌చేయాలని ఆయన తెలిపారు. పల్లెల్లో ఈ పథకం గురించి ప్రజలకు తెలియపరుచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూరేలా చూడాలని తెలిపారు.

8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
మహబూబాబాద్ టౌన్, జనవ రి 2: కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8,9 తేదీలలో దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, ఎఐటియుసి జిల్లా కార్యద ర్శి బి.అజయ్, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి సూర్యం, మధార్‌లు పిలుపునిచ్చారు. మానుకోటలో బుధవారం వారు ఇక్కడ మాట్లాడారు. నేడు స్థానిక గాంధీపార్కు లో జిల్లా సదస్సును నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఉదయం 11గంటలకు జరిగే ప్రదర్శనలో కార్మిక, విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొనాలని తెలిపారు. మోదీ నాయకత్వలో బీజేపీ గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నా రు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు.

యూనివర్సిటీకి భూములివ్వం
ములుగుటౌన్, జనవరి2: ప్రేమ్‌నగర్‌లో నిర్మించనున్న యూనివర్సిటీకి తమ పంట పొలాలను ఇవ్వమని ములుగు ఆర్డీవో రమాదేవికి బుధవారం రైతులు వినతిపత్రం అందించారు. 837 సర్వే నెంబర్ గల భూమిని 1971 సంవత్సరం లో ప్రభుత్వం అసైన్డ్ చేసి తమకు అప్పగించిందని, నాటి నుంచి కాస్తు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. ఈ భూమి యూనివర్సిటీ కోసం మా నుంచి తీసుకుంటే తమ బ్రతుకులు జీవనోపాది కోల్పోయి రోడ్డున పడుతామని, వ్యవసాయం తప్ప జీవించడానికి మా కుటుంబాలకు మరొకటి లేదని అన్నారు. మా కుటుంబాలకు ప్రభుత్వం నుండి న్యాయం చేయాలని తెలిపారు. వీరికి మద్దతుగా ఎమ్మార్పీ ఎస్ జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి, జిల్లా కార్యదర్శి పెండల మొగిలి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు లింగస్వామి, రాజయ్య, సమ్మ య్య, రాజేందర్, కార్తీక్, సారయ్య, రాజు, కుమార్ ఉన్నారు.

బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
వరంగల్, జనవరి 2: వరంగల్ అర్బన్ జిల్లాను బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దుటకు అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్లైల్-5 సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికుల పరిరక్షణకుగాను ఆపరేషన్ స్లైల్ ద్వారా తప్పిపోయిన వీధి బాలలు మరియు బాలకార్మికుల రక్షణకు సంరక్షణ కల్పించే లక్ష్యంగా జిల్లాలో పోలీస్‌శాఖ, స్ర్తి, శిశుసంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, క్రీడలు, సిడబ్ల్యూసి చైల్డ్‌లైన్, స్వచ్చంద సంస్ధల భాగస్వామ్యంతో బాల కార్మికుల నిర్మూలణకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జనవరి 1 నుండి 31వ తేది వరకు ఆపరేషన్ స్లైల్ ద్వారా జిల్లాలోని బాలకార్మికులను గుర్తించి వారి పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 1 నుం డి 14 సంవత్సరాలలోపు బాల కార్మికులను గుర్తించుటకు గాను హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇటుక తయారి కేంద్రాలు, రైల్వేస్టేషన్లు తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించాలని ఆయన కోరారు. స్వాదార్ ఇన్‌స్ట్యూట్‌లను తరుచూ పరివేక్షించడం దావరా ఆయా కేంద్రాలలో బాలకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం సులభతరం జరగుతుందని అందుకుగాను పోలీస్ శాఖ, శిశు సంక్షేమ శాఖ తనిఖీలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 103 బాలకార్మికులును గుర్తించి చైల్డ్ ప్రొటేక్షన్ సెంటర్‌లో రక్షణ కల్పించడంతో పాటు వారికి విద్యాపరంగా కేజివీబీ పాఠశాల, మోడల్ పాఠశాలలో ప్రవేశాలు కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కేఎంసీలో వైద్య పరీక్షలు నిర్వహించి సర్ట్ఫికెట్లు వారంలోగా అందజేయాలని తద్వారా బాలకార్మికులువున్న యాజమాన్యంపై త్వరితగతిన కేసులు నమోదు చేయుటకు సులభత రం అవుతుందని అందుకు వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి శైలజకుమారి, జిల్లా బాలకార్మికుల, సంరక్షణ అధికారి సంతోష్‌కుమార్, లీగల్ ప్రొటెక్షన్ అధికారి సతీష్ పాల్గొన్నారు.