వరంగల్

ఇకపై అంతట నగదు-రహిత ఈ-్ఛలన్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 18:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నగదు రహిత ఈ-్ఛలన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని వరంగల్ కమిషనరేట్ పోలీస్ విభాగాన్ని మరింత అధునికరించడంతో పాటు, డిజిటలైజేషన్ విధానాన్ని వినియోగించుకోని లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ విధులను మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపోందిచడం, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల ఉండాల్సిన బాధ్యతలను తెలియజేసేందుకుగాను ఈ-్ఛలన్ విధానాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో (వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల తప్ప) ఇక హైద్రబాద్ తరహలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఈ ఛాలన్ పద్దతిలో జరిమానాలను విధించడం జరుగుతుందని తెలిపారు. గతంలో పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వాహనదారుల నుండి ట్రాఫిక్ చట్టాలను అనుసరించి జరిమానాలను సదరు పోలీసులు సదరు వాహనదారుడి నుండి ప్రత్యేక్షంగా జరిమానా రుసుమును వసూలు చేయడానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్వస్తి పలుకుతూ గత సంవత్సరం ఈ-్ఛలాన్ పద్దతి ప్రారంభించడం జరిగింది. ఈ విధానానే్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ-్ఛలన్ విధానాన్ని అమలు పర్చేందుకుగాను అన్ని పోలీస్ స్టేషన్లకు ఇందుకు అవసరమయిన సామాగ్రి అందజేయబడిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
* ఈ-్ఛలన్ విధానం అమలు విధానం
ఈ-్ఛలన్ పద్దతిలో భాగంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనాలను గుర్తించి వాటిని ఫోటో తీసి సదరు వాహనదారుడు ఏ విధంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినాడో మొదలైన వివరాలను ఆన్ లైన్ పద్దతిలో నమోదు చేయబడుతాయి. రోడ్డు రవాణ శాఖ సంబంధించి కంప్యూటర్ సర్వర్ అనుసంధానం కావడంతో వెలువడిన సదరు వాహనదారుని సమాచారం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారుని డ్రైవర్ సెల్‌పోన్‌కు సదురు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ గల వాహనం యజమానికి ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లంఘించిన ప్రదేశం, సమయం, తేది మొదలైన వివరాలను తెలియపరుస్తూ, ఇందుగాను విధించిన జరిమానాకు సంబంధించిన సంక్షిప్త సందేశాన్ని పంపించబడుతుంది. సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి సంక్షిప్త సందేశాన్ని అందుకున్న వాహనదారుడు తాను చెల్లించాల్సిన జరిమానాను స్ధానిక మీసేవా, ఈసేవా, టీసీ, ఆన్‌లైన్, పేటీయం ద్వారా కట్టాల్సి ఉంటుందని అన్నారు. అదే విధంగా ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక్షంగా నిర్వహించే తనీఖీల్లో వాహనదారుడు ఏదైనా నిబంధనను అతిక్రమిస్తే సదరు వాహనదారునికి సమాచారాన్ని ఆన్‌లైన్ పద్దతిలో నమోదు చేసి నోటీస్ పత్రాన్ని వాహనదారుడుకి అందజేయడం జరుగుతుందని అన్నారు. అతడు కూడా పై తెలిపిన పద్దతిలోనే రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దీనితో అధికారులు తనీఖీల్లో ప్రత్యేక్షంగా జరిమానాలు వసూల్ చేయడానికి స్వస్తి పలికినట్లే.

జమాతె ఇస్లామి హింద్ బహిరంగసభను విజయవంతం చేయండి

నర్సంపేట, జనవరి 18 : వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపిజె డివిజన్ అధ్యక్షులు టిజె ఎస్ రూరల్ జిల్లా సమన్వయకర్త షేక్‌జావిద్ పిలుపునిచ్చారు. శుక్రవారం గౌసియా మసీద్‌లో వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హన్మకొండ జక్‌రియా ఫంక్షన్ హాల్‌లో ఈనెల 27 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి సభ జరుగనున్నట్లు తెలిపారు. దేశంలో పాసిజం, మత విద్వేషం, హత్యాచారాలు పెరుగిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోఅయ్యుం, మస్తాన్, సర్వర్, జావేద్, అబ్బాస్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న హమాలీ కూలిల సమ్మె

నర్సంపేట, జనవరి 18 : కూలీల రేట్లు పెంచాలని హమాలీ కూలీలు సమ్మె చేస్తున్నట్లు అఖిల పక్ష హమాలీ కూలీ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు గుండెబోయిన కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కూలీల రేట్లు గడువు ముగిసినందు వలన నూతన ఒప్పందం చేసుకోవాలని కూలీలు చేపట్టిన సమ్మె రెండు రోజులకు చేరిందని తెలిపారు. ఇప్పటికీ యాజమాన్యాలతో జరిపిన చర్యలు సఫలంకాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి మా సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ కెవి జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి లక్ష్మినారాయణ, రాదారపు ఎల్లయ్య, అనంతగిరి రవి, నాగులు, ప్రసాద్, బిక్షపతి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని కరపత్రాల పంపిణీ

భీమదేవరపల్లి, జనవరి 18: హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భీమదేవరపల్లి, ఎల్కతూర్తి, కమలాపూర్ మండలాలలోని అన్ని గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేసినట్లు హుజూరాబాద్ జే ఎసీ చైర్మన్ ఆవునూరి సమ్మయ్య తెలిపారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుని ఆలయంలో పీవీ జిల్లా ఏర్పాటు కొరకు వీరభద్ర స్వామి వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కొరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు అయితే భీమదేవరపల్లి, ఎల్కతూర్తి, కమలాపూర్, సైదాపూర్, శంకరపట్నం, వీనవంకా, చల్లారు(కొత్తగా) జమ్మికుంట, వావిలాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, హుజూరాబాద్, హుస్సాబాద్‌తో పాటు మొత్తం 13 మండలాలతో ఆరు లక్షలకు పైగా జనాభ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కోరకు కేసీ క్యాంప్‌లో 60 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని ఇందులో అన్ని జిల్లాల కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ హుజూరాబాద్‌కు జిల్లా ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు త్వరలోనే 13 మండాలలు కలిగిన పీవీ జిల్లా కోరకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని అన్నారు.

పారిశుద్ద కార్మికులకు చెక్కుల రూపంలో వేతనాలు ఇవ్వాలి

భీమదేవరపల్లి, జనవరి 18: వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులకు వేతనాలను చెక్కుల రూపంలో ఇవ్వాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాలోతు రాజేష్‌నాయక్ శుక్రవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ప్రాధమిక, జెడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులకు ఆయా పాఠశాలలలోని ప్రధానోపాధ్యాయులు ప్రతి నెల 1000-1500 వందల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రతి నెల 2500వరకు వేతనం అందిస్తుందన్నారు. జిల్లాలోని కొందరు ప్రధానోపాధ్యయులు తమ చెతివాటం చూపిస్తున్నారని ఆరోపించారు.

హోరెత్తిస్తున్న పంచాయితీల ప్రచారం

సంగెం, జనవరి 18: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాలలో పోటీ చేసే అభ్యర్ధులు ప్రచారాలను హోరేతిస్తున్నారు. గురువారం సంగెం మండలంలోని వివిధ గ్రామాలలో చలి సైతం లెక్కచేయకుండా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తమ కార్యకర్తలతో ప్రతి ఇంటికి తిరుగుతూ తమ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. నేటితో ప్రచారం గడవు ముగుస్తుండడంతో సర్పంచ్, వార్డు సభ్యుల తెల్లవారుజాము నుండి మొదలుకుని రాత్రి వరకు గుంపులు, గుంపులుగా తిరుగుతూ తమ అభ్యర్ధికి ఓటు వేయాలంటే ప్రతి ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయాత్నాలు కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో తెరాస పార్టీకి ఆ పార్టీ రెబల్ పార్టీ అభ్యర్ధులు పోటీ పడడం ఆ పార్టీ ఓటర్లలో ఆయోమయ పరిస్థితి ఏర్పడింది.

నల్లబెల్లిలో పంచాయితీ ప్రచార జోరు

నల్లబెల్లి, జనవరి 18: రెండవ దప పంచాయితీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మురం చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మరిపించేలా ద్వీచక్ర వాహన ర్యాలీలు, జైతెలంగాణ అనే నినాదాలతో పల్లెలు మారుమోగుతున్నాయి. నల్లబెల్లి మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయితీలకు గాను ఏడు గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 22 గ్రామ పంచాయితీలలో అధికార తెరాస పార్టీ, కాంగ్రెస్‌తో పాటు ఇండెపెండెట్స్ బరిలో ఉండగా వార్డు మెంబర్స్ ప్రచారంలో దూసుకవెళ్తున్నారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం సర్పంచ్ అభ్యర్ధులు ముందస్తుగానే అధికారుల ఇండ్లలోకి వెళ్లి తమకు మద్దతు తెలిపాలని పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పల్లె ప్రాంతాల నుండి పనుల కోసం వలస వెళ్లిన వారికి అభ్యర్ధులు ఫోన్లు చేసి తమకు ఓటు వాయాలని కోరుతూ ప్రచారం చేపడుతున్నారు.

చెన్నారావుపేటలో నామినేషన్ల పర్వం

చెన్నారావుపేట, జనవరి 18: చెన్నారావుపేట మండల కేంద్రంలో పలువురి పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధులుగా, వార్డు మెంబర్లుగా తమ నామినేషన్‌ను ఎన్నికల అధికారికి శుక్రవారం అందజేశారు. చెన్నారావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్దిగా బొంత శ్రీనివాస్ తన నామినేషన్ వేయగా, ఆరవ వార్డు మెంబర్‌గా మాచర్ల అనూష తన నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా మండల కేంద్రంలోని నూతన గ్రామ పంచాయితీ అయిన బోడామణిక్యం తండా సర్పంచ్ అభ్యర్ధిగా బోడా ఆనందర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్లు వేసిన రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంనేందుకు పల్లెలలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్ సమయానికి వచ్చేలా తమ ప్రయాత్నాలలో మునిగిపోయారు.

మేమున్నామని.. మీకేంకాదని...

వరంగల్, జనవరి 18: వరంగల్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం నుండి రాఫిడ్ యాక్షన్ ఫోర్స్ నిఘా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన క్షణాల్లో ఈ ఫోర్స్ అక్కడికి చేరుకుంటుంది. యాక్షన్ అస్టెంట్ కమాండ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న ఏడు పోలీస్ స్టేషన్లతోపాటు జనగామలో కూడా ఈ ఫోర్స్ పెట్రోలింగ్ ఉంటుంది. ప్రజలకు భద్రతపై భరోస కల్పించడం కోసమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు శుక్రవారం సుబేదారి ప్రాంతంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించింది. స్ధానిక డీఐజీ కార్యాలయం నుండి జులైవాడ, రెవెన్యూ కాలనీ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్ధానిక పోలీసుల కలసి ఐదు రోజులు నగరంలోని పోలీస్ స్టేషన్లతో పాటు,జనగామ, పరకాల, నర్సంపేట, పరిధిలో ఉన్న పలు సమస్యాత్మక ప్రాంతాల మీదుగా ఈ కవాతు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో ధైర్యం నింపి ఆసాంఘిక శక్తులకు పోలీసులు శక్తిని చూపించడంతో పాటు నేరాల నియంత్రించడంతో పాటు నేరాలను గుర్తించడంతో పోలీసులు అనుక్షణం శ్రమిస్తారని, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ ప్లాగ్ మార్పులో హన్మకొండ ఏసీపీ చంద్రయ్య, ఏఆర్ ఎసీపీ సదానందం, ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశాంత్, సుబేదారి ఇన్స్‌స్పెక్టర్ సదయ్య, ఎస్సై మహేందర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఓటర్ల ఫిర్యాదు నమోదుకు 1950 టోల్ ఫ్రీ నెంబర్

వరంగల్, జనవరి 18: ఓటర్లు పలు విషయాలపై చేసే ఫిర్యాదులకు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం ఢీల్లి నుండి భారత ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టర్ కుషాల్‌పతీక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 1950 టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై మాట్లాడారు. అంతకు ముందు 1950 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఓటర్లు పలు అనుమానాలు నివృత్తికి ఫోన్ చేస్తే అది ఎన్నికల కమిషన్‌కు వెళ్లి అక్కడి నుండి సంబంధిత జిల్లాకు వెళ్లేదని అయితే ఇప్పుడు అలా కాకుండా జిల్లాలోనే జిల్లా కాంట్రాక్ట్ కేంద్రానికి పంపిచండం జరుగుతుందని అన్నారు. ఇందుకు జిల్లాల కలెక్టర్లు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కాంట్రాక్టు కేంద్రానికి ఒక అధికారిని నియమించడంతో పాటు ప్రింటర్, స్కానర్, నెట్, తదితర వౌళిక సదుపాయాలు ఉండాలన్నారు. ప్రతి ఫిర్యాదుకు నమోదు చేయడానికి నలుగురు సిబ్బందిని నియమించాలని చెప్పారు. వీరు 12 గంటలపాటు విధుల్లో ఉండలన్నారు. ఈ నలుగురు సిబ్బంది ప్రాంతీయ బాషల్లో అవగహన కలిగి ఉండాలన్నారు. ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు ఈ కేంద్రం పనిచేయాలని సూచించారు. కాలర్ రికార్డింగ్‌ను 90 రోజులవరకు నిక్షప్త పరచాలన్నారు. ఈ కేంద్రం ఎన్నికల సమయంలోనే కాకుండా సంవత్సరంలోని 365 రోజులు ఈ నెంబర్ పనిచేస్తుందని తెలిపారు.