వరంగల్

గులాబీ గుబాళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జనవరి 25: పల్లె సిగపై గులాబీ గుబాళించింది. ఊరూర హోరాహోరీగా జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ చోట్ల తెరాస మద్దతు దారులు జయకేతం ఎగుర వేసి హవా కొనసాగించారు. పరకాల, నడికూడ మండలాలలో హస్తం వాసిని మరిపంచేలా ఈ సారి ఎన్నికల్లో తెరాస తిరుగులేని అధిక్యాన్ని అందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న తెరాస మరోసారి దూకుడు కొనసాగించింది. శుక్రవారం పరకాల, నడికూడ మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెరాస బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాటిన హవాను అలాగే కొనసాగించేలా పంచాయతీ ఎన్నికల్లో అశాజనకమైన ఫలితాలు గులాబీ పార్టీకి దక్కాయి. అక్కడక్కడ హస్తం పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు విజయాల్ని అందుకున్నారు. స్వతంత్రులు, తెరాస రెబల్ కొన్ని స్థానాల్లో గెలుపొందారు. ఈసారి ఓటర్లు విలక్షమైన తీర్పు ఇచ్చారు. పార్టీల రహితంగా జరిగిన ఎన్నికలైనప్పటికి బరిలో నిలిచిన వారు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెల్లో ఈసారి రసవత్తర పోరు కొనసాగింది. నువ్వా-నేనా అనేట్లు చాల పంచాయతీలో అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఆయా గ్రామాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీల గుర్తులు లేకున్నా ఫలానా మద్దతుదారులుగా ప్రచారం చేసుకున్న క్రమంలో ఊరూరా రాజకీయం రసవత్తరంగా మారింది. ఫలితాల్లో మాత్రం తెరాస మద్దతుదారులే అత్యధికంగా గెలుపొంది హవా కొనసాగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నిరాశతో ఉన్న కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులుగా బరిలో నిలిచిన వారికి మద్దతుగా కొండా మార్క్ నిలవలేదనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి.
* ఫలితాలు ఇలా...
సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గ్రామలు సర్వాపురం, నార్లాపూర్, ముస్త్యాలపల్లి, నర్సక్కపల్లి, నడికూడ, పులిగిల్ల, రాయపర్తి, కంఠాత్మకూర్, వెల్లంపల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయకేతనం ఎగుర వేసింది. అంతేకాకుండా ఇది వరకే హైబోతుపల్లి, వరికోల్, పోచారం, మల్లక్కపేట, కామారెడ్డిపల్లి, కౌకొండ, అలియాబాద్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పరకాల, నడికూడ మండలాల్లో తెరాస హవ కొనసాగింది. నాగారం, వెంకటాపూర్‌లో కాంగ్రెస్, ధర్మారంలో కాంగ్రెస్, పైడిపెల్లిలో ఇండిపెండెంట్, లక్ష్మీపురంలో తెరాస రెబల్, చర్లపల్లిలో కాంగ్రెస్, చౌటుపర్తిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

ఓటు వజ్రాయుధం

భూపాలపల్లి, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకుని అన్ని రకాల ఎన్నికలలో ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రం లో ఓటరు అవగాహన ర్యాలీ, మానవహారం, సమావేశం నిర్వహించారు. ముందుగా ఆచార్య జయశంకర్ విగ్ర హం వద్ద కలెక్టర్ ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ అం బేద్కర్ సెంటర్ చేరి అక్కడ వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు, ఎన్నిక ల బూత్ లెవల్ అధికారులు, వివిధ శాఖల అధికారులచే మానవహారం నిర్వహించి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, సమర్ధవంతమైన నాయకులను పాలకులుగా ఎన్నుకునేందుకు సరైన వజ్రాయుధం ఓటు కాబట్టి ఓటు హక్కు అర్హత గల వారు అందరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని అన్ని రకా ల ఎన్నికలలో ఓటు వేసి సమర్ధవంతమై న నాయకులను ఎన్నుకోవాలని అన్నా రు. శాసనసభా ఎన్నికల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో పని చేసి ఓటర్లను ఓటు ప్రాధాన్యతపై చేపట్టిన వివిధ కార్యక్రమాల వలన జిల్లాలో నూతనంగా 36 వేల మంది యువత నూతన ఓటర్లు నమోదై గతంలో నమోదైన 79 శాతం నుండి 83 శాతంకు పైగా జిల్లాలో పోలింగ్ జరగిందని, అలాగే దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పా టు చేశామని, జిల్లాలో నూతనంగా 17 వేల ఎపిక్ కార్డులను అందించనున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో స్థానిక ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, జిల్లా వెల్ఫేర్ అధికారి చిన్నయ్య, డీపీఆర్‌వో బి.రవికుమార్, రెవెన్యూ అధికారులు తదితరు లు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో అధ్యక్షతన అంబేద్కర్ మినీ హాల్‌లో సమావేశం నిర్వహించి సీనియర్ సిటిజన్స్‌ను సన్మానించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో
* రెండవ విడుత పోలింగ్ ప్రశాంతం
* ఎన్నికలకు భారీగా పోలీస్ బందోబస్తు
* వరంగల్ సీపీ రవీందర్ వెల్లడి

వరంగల్, జనవరి 25: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేడు శుక్రవారం నిర్వహించిన రెండవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ శుక్రవారం తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 మండలాల్లోని 268 గ్రామాలకు 52గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగితా 216 గ్రామ పంచాయతీలకు తొలి దశలో నిర్వహించిన పోలింగ్ పూర్తిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహించిన అన్ని గ్రామాల్లోను ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకుగాను వ్యూహత్మకమైన ప్రణాళికలతో విధులు నిర్వహించడంతో పాటు, హోంగార్డ్ స్ధాయి పోలీస్ అధికారి నుండి డీసీపీ స్ధాయి అధికారి వరకు అందరు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకుగాను ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం 7గంటల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పోలింగ్ అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి గ్రామాలతోపాటు, ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో ఎలాంటి ఉదృక్తతకరమైన వాతావరణాన్ని కలగకుండా స్ధానిక పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు లెక్కింపు సమయంలో గ్రామంలో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. పూర్తి స్ధాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం, గ్రామ పంచాయతీ ఎన్నికల తోలి ఘట్టంలో పోలింగ్, లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన జరుగకుండా పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమీషనర్ తెలిపారు.

టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపించాలి
*పార్టీ వ్యతిరేకులపై చర్యలు తప్పవు
*ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి, జనవరి 25: ఈ నెల 30న పాలకుర్తిలో జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్, వార్డు మెంబర్లను భారీ మేజార్టీతో గెలిపించి అభివృధ్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుర్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బమ్మెర, నర్సింగాపురం తండ, ముత్తారం, వల్మీడి, చెన్నూర్, మైలారం, విస్నూర్, తీగారం, దుబ్బతండ, తొర్రుర్, మల్లంపల్లి, పాలకుర్తి, చీమలబాయి తండ, తిరుమలగిరి, అయ్యంగారిపల్లి గ్రామాల టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పంచాయితీ ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సలహాలు, సూచనలు చేశారు. గ్రామల్లో పార్టీకి వ్యతీరేకంగా, రెబల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులు బరిలో నుండి తప్పుకోని, పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపుకోసం పని చేయాలని సముదాయించారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామాని హామి ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంమే అధికారంలో ఉన్నందున తము బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృధ్ధి పథంలో పయానిస్తాయన్నారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకేళ్ళి వివరించాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలన్నింటిని నేరవేస్తామన్నారు. ఈనెల 30న పాలకుర్తి మండంలోని 36గ్రామ పంచాయితీల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆఖాండ మేజార్టీతో గెలిచి, మారోసారి పాలకుర్తి గడ్డపై గూలాబి సత్తా నిరూపించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, మండల పార్టీ అధ్యక్షులు నల్ల నాగిరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గోన్నారు.