వరంగల్

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్/ స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి 1: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం, ఎమెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 3వ విడుత పం చాయతీ ఎన్నికలు జరిగిన చిల్పూర్, స్టేషన్‌ఘనపూర్ మండలాలల్లోని గ్రామాల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌లు శుక్రవారం వరంగల్ నగరంలోని హన్మకొండ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన ముందుగా గెలుపొందిన సర్పంచ్‌లను అభినందించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్ముల్ని గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకునే విధంగా ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేయాలని ఆయన సూచించారు.

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

మహబూబాబాద్, ఫిబ్రవరి1: ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభిస్తు రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని మహబూబాబాబాద్ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మహబూబాబాద్ మండలలోని పర్వతగిరిలో దారావత్ వెంకన్న అనే రైతు సాగుచేస్తున్న పంటలను కలెక్టర్ శివలింగయ్య శుక్రవారం పరిశీలించారు. భూమిపైన కాకుండా టెండాలలో పండిస్తున్న తీగెజాతి కూరగాయాలైన బీర, కాకర, చిక్కుడు పంటలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిమీద కాకుండా టెండాలలో పండించడం వల్ల అధిక దిగుబడులతోపాటు ఎక్కు వ గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. అంతేగాక రైతులకు శ్రమకూడా తగ్గుతుందని తెలిపారు. ఈ విధమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిం చే రైతులకు వ్యవసాయశాఖ టెండాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. నెట్‌హౌజ్‌లో పండించిన టమాట పంటను కలెక్టర్ పరిశీలించారు. రెడ్‌మీ కాంపోస్ట్ బెడ్‌లను పరిశీలించారు. వర్మీకాంపోస్ట్ జీవన ఎరువులు వాడడం వల్ల తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు రాబట్టవచ్చన్నారు. అంతేగాక వర్మీ కాంపోస్ట్ మూలంగా భూసారం పెంపొందించుకోవచ్చని తెలిపారు. నెట్‌హౌజ్‌ను, టెండాల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. రాష్ట్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఆ పథకాల పట్ల రైతుల్లో అవగాహన పెంపొందించాల ని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని బలోపెతం చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, తహశీల్దారు బన్సిలాల్ తదితరులు పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు
పటిష్ట ఏర్పాట్లు
వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

వరంగల్, ఫిబ్రవరి 1: లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఏనుమాముల మార్కెట్ యార్డ్‌ను ఆయన పర్యటించారు. ఈ సందర్భం గా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంత రం కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంబంధ పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈవీఎం, కంట్రోల్ యూనిట్ల తనిఖీ, కమిషనింగ్‌లకు సదుపాయాలు చేపట్టాలన్నారు. ఏనుమాముల మార్కెట్ యార్డ్‌లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజక వర్గాలకు సంబంధించి శాసనసభ సాధారణ ఎన్నికల్లో కమిషనింగ్, డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. వాటినే పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధిం చి స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రానికి గిడ్డంగిలో ఏర్పాట్లు చేయాలన్నా రు. గిడ్డంగులు శుభ్రం, నామసూచకలో సంబంధిత మార్పులు, వైట్ వాష్, లైటింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రత్యామ్నాయ గౌడౌన్‌లను గుర్తించాలన్నారు. గోడౌన్ల వద్ద తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతాపరంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ గణేష్, ఆర్ అండ్ బీ ఈ ఎఎల్‌రాజాం, డీఈపి. రాజు, వరంగల్ హన్మకొండ తహశీల్ధార్లు రాజేష్, బావుసింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
* కలప అక్రమ రవాణాను కట్టడి చేస్తాం
* జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్,్ఫబ్రవరి 1: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. మానుకోట టౌన్‌పోలీస్‌స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అటవీశాఖ, పోలీస్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల్లో చెట్లు నరకడం, కలపను అక్రమ రవాణా చేయడం వంటి అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. అడవిలో చెట్లునరికి అక్రమంగా కలప తీసుకోస్తే శ్యామిల్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేయకూడదని ఆదేశించారు. అలా అక్రమ కలపతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. అక్రమ కలప రవాణాదారులపై, చెట్లు నరుకుతున్న వారిపై పిడియాక్టు పెడుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ సంరక్షణ అంశంలో చాలా ప్రణాళికతో ఉన్నారని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలంటే వన సంరక్షణ ఒకటే మార్గం అని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. కలప అక్రమ రవాణాదారులపై కఠిన చట్టాలు అమల్లోకి తేవడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చెక్‌పోస్టులు పెట్టి అక్రమ రవాణాకు ఉపయేగించే వాహనాలను సీజ్‌చేయాలని అన్నారు. అటవీశాఖ వారికి పోలీస్ శాఖ నుండి ఏ విదమైన సహాయం కావాల్సి వచ్చినా అందించడానికి తాము సిద్దంగా ఉంటామని తెలిపారు. అక్రమ కలప రవాణాను పూర్తిగా నిరోదించే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. అటవీచట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీశాఖకు చెందిన భూముల కబ్జాపై కఠినంగా వ్యవహరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో చట్టలపై అవగాహన పెంచే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. తరుచుగా నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలని, గ్రామాల్లో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యపరుచాలని అన్నారు. పోలీస్ కళాబృందాల ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. పోలీస్‌శాఖ, అటవీ శాఖ సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రగతిని సాదించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డితోపాటు అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కృష్ణమాచారి, డి ఎస్పీ నరేష్‌కుమార్, మదన్‌లాల్, రెలా జనార్ధన్‌రెడ్డి, టౌన్ సీఐ రవికుమార్, బయ్యారం సీఐ రమేష్, గూడూరు సీఐ బాలాజీ, డోర్నకల్ సీఐ శ్యాంసుందర్, సీఐ తిరుపతి, రమేష్, వెంకట్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.