వరంగల్

వనమంతా పులకింతా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, ఫిబ్రవరి 22: వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో వనమంతా పులకించింది. గత రెండు రోజులుగా భక్తులతో కిటకిటలాడిన మేడారం మూడో రోజు శుక్రవారం చల్లని తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తు బెల్లాలు, ఎదురు కోళ్లతో అమ్మవార్లను తనివితీరా తమ కోర్కెలు నెరవేర్చాలంటూ ప్రణమిల్లారు. చిన్న జాతరకు వచ్చిన భక్తులతో గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు పరిసరాలు జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా హిజ్రాలు మహిళల వేషదారణలతో భోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తరలివెళ్లే క్రమంలో నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్ల సన్నిధికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. బుధవారం ప్రారంభమైన చిన్న జాతర శనివారంతో ముగియనుంది. ఏటూరునాగారం ఐటీడీ ఏ పీవో చక్రధర్‌రావు, ఆర్‌డీవో రమాదేవి, డీ ఎస్పీ విజయసారధి ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. గురువారం ఎస్పీ ఆర్.్భస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. పారిశుద్ధ్య పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, వైద్యం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.ఒ

తునికాకు సేకరణ టెండర్లు నిర్వహించాలి
మహబూబాబాద్, ఫిబ్రవరి 22: వేసవిలో పేద ప్రజలకు జీవనోపాధి కల్పించే తునికాకు సేకరణ టెండర్లు నిర్వహించటంతో పాటు వంద కట్టకు మూడు రూపాయాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. గార్ల మండలం గోపాలపురం న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన రైతుకూలీ సంఘం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు నెలలో టెండర్లు నిర్వహించాల్సి ఉండగా రెండు నెలలు గడుస్తున్న టెండర్ల నిర్వాహణలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరీ అనుసరించిందని ఆరోపించారు. ఫిబ్రవరి నెలలో ఆకు ప్రాసేసింగ్ పనులు, ధరలు నిర్ణయించాల్సి ఉందన్నారు. జంతువులు తిరిగే ప్రాంతాలను, అభయరణ్యాలైన పాల్వంచ, ఉల్వనూరు, కినె్నరసాని, టేకులపల్లి, కొత్తగూడెం, కల్వాల మండలాల్లో ఆకు సేకరణ కల్లాలను రద్దు చేసిందని, దీంతో అ ప్రాంతాల్లోని ఆదివాసులు, పేదలు పని దినాలు కొల్పోయరన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని బీరాలు పలికే పాలకులు పేదలకు ఉపాధి లేకుండ చెయ్యటం విచారకమని, అ ప్రాంతాలను సహితం పరిశీలన జరిపి సేకరణకు జరపించాలని కోరారు. ఆకు లభ్యతకు అనుగుణంగాటార్గెట్ నిర్ణయించాలని, తునికాకు సేకరణ నష్టం జరుగకుండ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సేకరణ సమయంలో ప్రమాదాలు, ప్రాణ హానీ జరిగితే కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ప్రాసేసింగ్ పనులను ముప్పై శాతం పెంచాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సంఘం నాయకులు ఇర్రిరవి, ఉపేందర్, జనార్థన్, వెంకటనర్సయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

మహిళలకు ఎస్సీ ఎస్టీలకు ఇదేనా న్యాయం

జనగామ టౌన్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో మహిళలకే కాకా ఎస్సీ, ఎస్టీలకు మళ్ళీ తీరని అన్యాయం చేశారని టీపీసీసీ కార్యదర్శి మద్దెల సంతోష్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తంచేశారు. జనగామలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినేట్‌లో మహిళలకు ప్రాధాన్యం దక్కలేదని, గత నాలుగుసంవత్సరాలు మహిళాలోకం గగ్గోలు పెట్టినప్పటికీ ముఖ్యమంత్రి కేసిఆర్ మళ్లీ మంత్రివిర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదన్నారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల పట్ల చూపవల్సిన గౌరవ మర్యాదలు ఇవేనా అని విమర్శించారు. అంతేకాకా ఎస్సీ, ఎస్టీలకు సైతం అవకాశం కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. రెండవ క్యాబినేట్‌లో అయినా అవకాశం కల్పిస్తారని ఆశించిన సామాజిక వర్గాలపై మొండిచేయి చూపించారని అన్నారు. గతంలో ఎమ్మెల్యే కాకముందే హరిష్‌రావుకు మంత్రిపదవి ఇచ్చారని, కాని ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి, టీఆర్‌ఎస్ పార్టీని గత 18సంవత్సరాలుగా తన బుజాలపై మోస్తూ, పార్టీలో త్రిబుల్‌షూటర్‌గా పేరు పొందిన వ్యక్తికి ఏ స్వార్థంతో మంత్రిపదవి ఇవ్వలేదో తెలపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అత్యంత కీలక మంత్రిత్వ శాఖలు తన దగ్గరే ఉంచుకొని ప్రాధాన్యత లేని శాఖలు, మంత్రులకు కేటాయించిన డమ్మి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసి తమ నియంతనను మరోసారి తెలియజేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కేవలం బడ్జెట్ కోసమే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసినట్లుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకుండానే మంత్రి వర్గ విస్తరణ కాలయాపన చేశారని ఆరోపించారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ద్రోహులే ఎక్కువగా ఉన్నారని ఆయన విమర్శించారు.

----------------------------------------

ఓటాన్ అకౌంట్‌పై బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

వరంగల్, ఫిబ్రవరి 22: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన లభించింది. బడ్జెట్‌ను అధికార పార్టీ నేతలు స్వాగతిస్తుండగా విపక్ష నాయకులు పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా స్పందించారు. బడ్జెట్‌లో రైతు రుణమాఫిపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. కేసీఆర్ బడ్జెట్ ఎన్నికల ప్రసంగంలా ఉందని ఆయన ఎద్దెవ చేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ప్రకటించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై రాష్ట్ర రైతు విమోచన చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు, వ్యవసాయ, సాగునీటి రంగానికి పెద్ద పీట వేశారన్నారు. పేదల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల కేటాయింపుకు ప్రాధ్యానత ఇచ్చారని చెప్పారు. మూడు నెలల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌కు స్పష్టత లేదని సీపీ ఏం నేత సారంపెల్లి వాసుదేవరెడ్డి అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పూర్తి స్ధాయిలో మార్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు డబుల్‌బెడ్ రూం పథకానికి నిధుల కేటాయింపు లేదన్నారు. సొంత స్థలం కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామికి ఎలాంటి కేటాయింపు జరగలేదని అన్నారు. ఆదాయానికి- ఖర్చుకు మధ్య 25వేల కోట్ల ద్రవ్యో లోటు ఉందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్‌రావు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చేతులు దులుపుకున్నాడే తప్పా బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు. అంకెల గారడీగా రూపొందించారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామి మేరకు నిరుద్యోగ బృతి చెల్లింపులపై విధి విధాలను రూపొందించకుండానే నామమాత్రము కేటాయింపులు చేసి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయాత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బడ్జెట్ ఉమ్మడి వరంగల్‌కు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధికి గాను సీ ఎం కేసీ ఆర్ ఇచ్చే 300 కోట్ల నిధులపై ఎలాంటి ప్రస్తావన లేదు. రైతులకు రుణ మాఫి వడ్డి 6వేల కోట్లు మాత్రమే కేటాయింపు జరిగాయని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
=======================================