వరంగల్

శివరాత్రికి ముందే కోటగుళ్లకు కొత్త శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, మార్చి 1: కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయం కోటగుళ్లకు శివరాత్రికి ముందే కొత్త శోభ సంతరించుకుంది. కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్ బల్బులతో ప్రత్యేకంగా అలంకరించారు. గణపేశ్వరాలయం, గర్భాలయంతో పాటు పరివార దేవాలయాలు రంగుల వెలుగుల్లో జిగేల్‌మన్నాయి. శివరాత్రి మరో మూడు రోజులు ఉండగానే ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఇంకా శివరాత్రి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

అభినందన్ విడుదలతో సంబరాలు
ములుగుటౌన్, మార్చి 1:పాకిస్తాన్‌లో బందీగా చిక్కిన భరత్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలైన సందర్బంగా ములుగులో విశ్వహిందూ పరిషత్ ఆద్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జాతీయ రహదారిపై బానాసంచా కాలుస్తూ, జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ భరత్‌మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విశ్వనాధ్, కుమారస్వామి, సంజీవరావు, నాగరాజు, బిక్షపతి, రాజు, కిషన్, రాజన్న, జనార్ధన్, రవిరెడ్డిలతో పాటు తదితరులు ఉన్నారు.
మహేశ్వర మెడికల్ కళాశాలలో
సమ్మెను ఉపసంహరించుకున్న అధ్యాపకులు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 1: మహేశ్వర మెడికల్ కళాశాలలో తరగతులు జరగడం లేదని తల్లిదండ్రులు, విద్యార్ధులు ఇచ్చిన ఫిర్యాదుపై కాళోజీ విశ్వవిద్యాలయం సంబంధిత కళాశాల యాజమాన్యం అధ్యాపకులతో జరిపిన సంప్రదింపులు ఫలించాయి. స్ట్రైక్‌ను విరమిస్తున్నట్లు అధ్యాపకుల బృందం లిఖిత పూర్వకంగా గురువారం యూనివర్సిటీకి తెలియజేశారు. మార్చి ఒకటి నుండి యథావిధిగా తరగతులు జరుగుతాయని వారు లేఖలో పేర్కొన్నారు.
శివాలయంలో
కుంకుమార్చనలు
ఏటూరునాగారం, మార్చి 1: మండల కేంద్రంలోని శివాలయంలో శుక్రవారం ఆలయ కమిటి ఆద్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. అర్చకుడు రాజేష్ స్వామివారికి కుంకుమ అర్చన, తైలాభిషేకాలను నిర్వహించగా భక్తులు పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ తాడూరి రఘు, వేణుగోపాల్ లాహోటి, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మంత్రి దయాకర్‌రావును
కలసిన ఎమ్మెల్యే సీతక్క
కాజీపేట రూరల్, మార్చి 1: రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును శుక్రవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి హోదాలో మొదటి సారిగా వరంగల్‌కు వచ్చిన సందర్భంగా ఆమె దయాకర్‌రావును కలసి బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి దయాకర్‌రావు ఎమ్మెల్యే సీతక్కకు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు మాజీ ఎంపీపీ నల్లెల కుమారస్వామి, పైడాకుల అశోక్ , ములుగు మండల సర్పంచ్‌లు గండి కల్పనకుమార్, అహ్మద్ పాష, భద్రయ్య, ఇన్నారెడ్డి, శైలజా, కొత్తగూడ మండల అధ్యక్షుడు సారయ్య, జక్కుల సాంభయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుతోట చంద్రవౌళి, బానోతు రవిచందన్, కూనురు అశోక్ తదితరులు ఉన్నారు.

ఆదివాసీలకు అన్యాయం చేస్తే సహించం
* భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
వెంకటాపురం(నూగూరు), మార్చి 1: పోడు భూములతో పాటు ఇతర ఆదివాసీ హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయం ఎదుట పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గోద్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 72 గంటల దీక్ష శిభిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి ఆదివాసీల డిమాండ్లకు న్యాయ సమతమని సంఘీభావం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలతోపాటు పేదల హక్కులను కాలరాస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
నాయకులతో రీలే నిరహర దీక్షలను నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. జీ ఎస్పీ వ్యవస్ధాప అధ్యక్షుడు సోంది వీరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, ములుగు జిల్లా అధ్యక్షులు వాసం నాగరాజు, నాయకులు నర్సింహామూర్తి, పూనెం సాయి, పలువురు దీక్ష శిభిరంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు చిదం మోహన్‌రావు, సీపీ ఐ నాయకులు మల్లీఖార్జున్‌రావు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఓటింగ్ యంత్రాల పరిశీలనను పర్యవేక్షించాలి

మహబూబాబాద్,మార్చి 1: త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటిదశ పరిశీలన జాగ్రత్తగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యం.డేవిడ్ నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో ఆయన ఎన్నికల అధికారులు, సిబ్బందితో ఈవీఎంల మొదటిదశ పరిశీలన పకడ్భందీగా నిర్వహించుటకు గాను తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు గాను 2182 ఓటింగ్ యంత్రాలు జిల్లాకు చేరుకుంటాయని వాటిలో 832బ్యాలెట్ యూనిట్లు, 650కంట్రోల్ యూనిట్లు, 700వివి ప్యాట్‌లు ఉన్నాయని చెప్పారు. వీటి మొదటిదశ పరిశీలన నిర్వహించుటకు గాను ఎన్నికల సంఘం 33మంది ఇంజనీర్లను కేటాయించిందని చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుండి ఈవీయంల ఎఫ్‌ఎల్‌సి రెండు షిప్టుల్లో నిర్వహించనున్నట్లు అందుకు గాను నియమించిన సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌సిల నిర్వహణకు గాను 40వరుసలు ఏర్పాటు చేసి ప్రతి రెండు వరుసలకు ఒక అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించడం జరిగిందని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఎస్‌ఎల్‌సిలు నిర్వహించాలని అన్నారు. మొదటిదశ పరిశీలన నిర్వహించిన ఓటింగ్ యంత్రాలకు ఎన్నికల సంఘం నిబందనల ప్రకారం తగు టాకింగ్ సిలింగ్ చేసి స్ట్రాంగ్‌రూంలో భద్రపరుచాల్సిందిగా ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తతతో ఎఫ్‌ఎల్‌సిలు సజావుగా జరిగేలా తగు విధంగా విదులు నిర్వర్తించాలని ఎలాంటి నిర్లక్ష్య వైఖరి జరిగినచో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎన్నికల జిల్లా నోడల్ అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి వెంకట్‌రెడ్డి, ఎన్నికల తహశీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.