పశ్చిమగోదావరి

ఉత్తర దక్షిణలతో రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 20 : రానున్న కొద్ది వారాల పాటు ఉత్తర దక్షిణాలతో అందరూ బిజీగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం జూన్ 8 నుంచి 15 వరకు బదిలీలపై వున్న నిషేధాన్ని సడలించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై శుక్రవారం సూత్రప్రాయంగా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. దానికి అనుగుణంగా నిర్దేశించిన రోజుల్లో బదిలీలకు అవకాశం కల్పిస్తోంది. అయితే బదిలీలపై ఉన్న నిషేధాన్ని కొద్దిరోజులపాటు సడలించే అవకాశం ఉందన్న సమాచారం బయటకు రావడంతోనే అధికార, ఉద్యోగ వర్గాలన్నీ అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి వున్నా బదిలీలు కోరుకుంటున్న వారు మాత్రం అస్తశ్రస్త్రాలతో సిద్ధమైపోతున్నారు. ఇంతకుముందే అమాత్యుల స్థాయిలో మాట్లాడుతూ అస్మదీయులను పోస్టింగులతో కాపాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించిన నేపథ్యంలో అస్మదీయులకు తప్పనిసరిగా ఫోకల్ పోస్టులు దక్కే అవకాశాలు ఈసారికూడా భారీగానే మెరుగుపడతాయని చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ బదిలీల అంశం అస్మదీయులకు పోస్టింగుల వ్యవహారం పరస్పర అవసరంగా మారిందనే చెప్పుకోవాలి. నియోజకవర్గంలో కార్యకలాపాలన్నీ తమ కనుసన్నల్లో జరగాలని అటు ప్రజాప్రతినిధులు కోరుకోవడం సర్వసాధారణం, ఇదే సమయంలో తమకు అనుకూలమైన లేదా తమ వర్గమైన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల పరిధిలో పోస్టింగులు తెచ్చుకుంటే తమ పంట పండుతుందన్న నమ్మకంలో కొన్ని ఉద్యోగ వర్గాలు వుండటం కూడా సాధారణమే. ఈ విధంగా పరస్పరం ఫలానా వారు కావాలని వీరు, ఫలాన చోట కావాలని వారు ప్రయత్నాలు చేసుకోవడం ఇంతకుముందు కూడా తెలిసిందే. గత కొద్దికాలంగా బదిలీల నిషేధంపై సడలింపు కోసం ఎంతోమంది ఎదురు చూస్తూనే వున్నారు. వారిలో చాలా మందికి సహేతుకమైన కారణాలున్నప్పటికీ మిగిలిన వారు మాత్రం లాభదాయకమైన పోస్టుల కోసం వేచి చూస్తూనే వున్నారని చెప్పుకోవాలి. ఇలాంటి వారంతా ఇప్పుడు ఉత్తర దక్షిణాలతో పూర్తిస్థాయి బిజీగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను దక్కించుకోవడంతోపాటు అవసరమైన చోట దక్షిణ సమర్పించుకునేందుకు కూడా సిద్ధంగా వున్నట్లే తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ఉత్తరాలు పొందిన వారు ఆ పరిధిలో డిమాండ్ పెరిగిపోతే ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని కూడా ముందుగానే చూసుకుని అక్కడ కూడా ఉత్తరాలను సాధించుకుని మరీ ఎక్కడా పొరపాటు జరగకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్త పడే పరిస్థితే కనిపిస్తోంది. ఈ వ్యవహారాలు ఇలా వుంటే ఇంతకుముందు బదిలీలపై నిషేధాన్ని సడలించిన తరుణంలో రకరకాల ఆటంకాలు రావడం, మరోసారి వరుసగా ఈ సడలింపును పొడిగించుకుంటూ రావడం వంటివి ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకువచ్చాయనే చెప్పాలి. ఈసారి ఈ వ్యవహారాలు ఎలా సాగుతాయో వేచిచూడాల్సివుంది. ఒక విధంగా చూస్తే జూన్ 8 నుంచి 15 లోపు ఈ సడలింపు అమలులో వుండవచ్చునని ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సంకేతాలు వెలువడటంతో ఆ సమయంలో ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు దాదాపుగా ఉండవకపోవచ్చునన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పొడిగింపులు కూడా ఈసారి అంతగా ఉండకపోవచ్చునని, ఇప్పటికే సడలింపు గడువుకు వారాల సమయం వున్నందున మిగిలిన వ్యవహారాలన్నీ సర్దుకునేందుకు అవకాశం వుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.