వరంగల్

మెరుగైన వైద్యం.. ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 6: ప్రజలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యమని.. పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఖర్చులేకుండా అందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖామంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. మానుకోటలోని ఏరియా ఆస్పత్రిలో సోమవారం నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలోని వివిధ వార్డులను తిరుగుతూ రోగులను పలకరించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా రూ. 10 లక్షల విలువైన సి-ఎపిఎంను, రూ. 10 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్ ఎక్స్‌రే సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైద్యానికి పెరుగుతున్న ఖర్చుల మూలంగా అనేక కుటుంబాలు అప్పులపాలౌతున్నాయని పలు సర్వేల ద్వారా తేలిందన్నారు. వైద్యానికి ఖర్చు పెట్టలేక పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్రాణాలు వదులుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాంటి దయనీయమైన పరిస్థితులు పోవాలని ప్రభుత్వ ఆస్పత్రులలోనే అన్ని రకాల సౌకర్యాలతో వైద్యం అందాలనే లక్ష్యంతో సౌకర్యాల కల్పనకు పెద్దమొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మానుకోటలో ప్రారంభించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఈ ప్రాంతంలో చిన్నారులకు సంజీవనిగా పనిచేస్తుందని తెలిపారు. మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆస్పత్రి అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల వైద్య అవసరాలకోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి దృష్టికి అనేక వినతులు తెచ్చారన్నారు. మానుకోట ప్రాంతంలో అత్యధికంగా గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఉన్నారని, వారి అవసరాలను గుర్తించి, మానుకోట ఏరియా ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారుస్తామని తెలిపారు. త్వరలోనే ఏరియా ఆస్పత్రిలో డయాల్సిస్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. కొద్దికాలంలోనే అత్యవసర చికిత్సలు అందించే ఐసియు సెంటర్, సిటి స్కాన్‌లను ఏరియా ఆస్పత్రిలో అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, అందులో భాగంగా 2118 పోస్టులను త్వరలో భర్తీచేయనున్నామన్నారు. అవసరమైతే కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీచేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించే ప్రభుత్వ లక్ష్యానికి వైద్యుల నుండి సంపూర్ణ సహకారం ఉండాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని తెలిపారు. తొర్రూరు, పాలకుర్తిలలో పోస్టుమార్టం సెంటర్ వీలైనంత త్వరలో ప్రారంభిస్తామన్నారు. మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమామురళీనాయక్, ఎంపిపి గోనె ఉమారాణి, జడ్పీటిసి మూలగుండ్ల వెంకన్న, డిఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకట్రాములు, ఆర్డీఓ భాస్కర్‌రావు, డిఎస్పీ రాజమహేంద్రనాయక్, తెరాస నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, జెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, గడ్డం అశోక్, డోలి లింగుబాబు, పానుగంటి రామకృష్ణరావు, ఎండి ఫరీద్, భూక్య ప్రవీన్‌నాయక్, దారావత్ స్వామినాయక్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.