వరంగల్

తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు కోదండరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 7: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై టిఆర్‌ఎస్ మంత్రులు చేసిన విమర్శలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో గల్లీ గల్లీకి తిరిగి అందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాంపై మంత్రులు చేసిన విమర్శలను ఆయన ఘాటుగా తిప్పికొట్టారు. తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల లాంటి వారు కూడా ఉద్యమనేత అయిన ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించడమా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమంలో ఈ మంత్రులు ఎక్కడున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ తరువాత రెండో స్థానం కోదండరాందేనన్నారు. కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వాటిని సరిదిద్దుకునేది పోయి ఎదురుదాడి చేస్తారా? అని అన్నారు. కోదండరాంకు మీలాగ పదవుల ఆశలు ఉంటే ఆయన ఎప్పుడో అత్యున్నత పదవిలో ఉండేవాడని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్, మరొకరికి ఏజెంటుగా పని చేస్తున్నాడని కించపరిచే మాటలు మాట్లాడడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సహా మంత్రులు కోదండరాంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి కోదండరాం చేసిన సేవలు మరువలేమన్నారు. ఇప్పటికైనా మంత్రులు ఇలాంటి విమర్శలను మాని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరిచే విధంగా ముందుకు పోవాలని ఆయన కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో వేం నరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.