వరంగల్

ఇక ఆటలకు సెలవు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 12: దాదాపు రెండు నెలల సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి సోమవారం నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈ రెండు నెలలు ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు ఇక పాఠశాల బాట పట్టనున్నారు. దీంతో గత వారం రోజుల నుండే బుక్‌స్టాల్స్, బట్టల షాపులు, షూ షాపులు విద్యార్థులతో సందడిగా మారాయి. ఇప్పటికే ప్రభుత్వం బడిబాట పేరుతో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుండే అనేక మార్పులు చేపట్టింది. జిల్లాలో దాదాపు 400 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టనుంది. అందుకోసం ఇప్పటికే 1500 ప్రత్యేక టీచర్లను గుర్తించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇక ఇంగ్లీష్ మీడియం బోధన జరుగనుండడంతో ఇక నుండి ప్రైవేటు పాఠశాలలకు బదులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరుతారనే ప్రభుత్వం భావిస్తుంది. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వౌళిక వసతులు కూడా ఏర్పాటు చేశారు. కాగా విద్యాశాఖ మంత్రి వరంగల్ జిల్లాకు చెందిన వారు కావడంతో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లాను ఆదర్శంగా ఉంచేందుకు పెద్దసంఖ్యలో విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టారు. ఇదిలావుంటే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతుంది. డొనేషన్లు, అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు దండుకుంటున్నాయి. ప్రభుత్వం ఒకవైపు అధిక ఫీజులకు కళ్లెం వేస్తామని చెపుతున్నప్పటికి ప్రభుత్వ విద్యాసంస్థలు మాత్రం యధేచ్ఛగా డొనేషన్లు, అధిక ఫీజులు వసూళ్లు చేస్తూనే ఉంది.