వరంగల్

టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 12: తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియేనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు అన్నారు. ఆదివారం వరంగల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే జీర్ణించుకోలేకపోతుందన్నారు. సూర్యాపేట బహిరంగసభలో అమీత్‌షా తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు జీర్ణించుకోలేకపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి ధమ్ము, ధైర్యం ఉంటే శే్వతపత్రం విడుదల చేయాలని లేదంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. సూర్యాపేట బహిరంగసభలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా తెలంగాణకు 90 వేల కోట్లు ఇచ్చారని చెప్పడాన్ని మింగుడుపడని టిఆర్‌ఎస్ మంత్రులు రెండేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 36వేల కోట్లే అంటూ తప్పుడు లెక్కలు చెపుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన 90వేల కోట్ల లెక్కలను ఆయన చూపించారు. అందులో రైల్వేకు 2,817కోట్లు, త్వరలో ప్రారంభం కానున్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 5500 కోట్లు, నేషనల్ హైవేకు 43,500 కోట్లు, విద్యుత్ రంగానికి 11,300, ఇరిగేషన్‌కు 7,300, కరువు సహాయానికి 797 కోట్లు, ఆరోగ్యకేంద్రాల కోసం 937 కోట్లు, విద్యావ్యవస్థకు 950కోట్లు, 14వ ఫైనాన్స్ కమిషన్ కింద 915 కోట్లు, సర్వశిక్షా అభియాన్ కింద 145కోట్లు, మెదక్‌లో నిమ్స్ ఫార్మసీకి 7వేల కోట్లు, స్వచ్‌భారత్ కింద 5100 కోట్లు, అంతేకాకుండా వరంగల్‌కు స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్ పథకాలను కేటాయించి కోట్ల రూపాయల నిధులను వెచ్చిందని తెలిపారు. కేంద్ర సహాయం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఫాంహౌజ్‌లో కూర్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెందనని, కేంద్రంతో సైక్యతగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే సర్కార్ ఉలిక్కిపడుతుందని, మొన్న కోదండరాంపై, నిన్న తమ పార్టీపై ఆ పార్టీ మంత్రులు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. మంత్రులు సిఎం కెసిఆర్‌కు చెంచాలుగా మారారన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సిపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీని ప్రలోభాలకు గురిచేసి ఆ పార్టీలను బలహీనపర్చిందని, ఇక తెలంగాణలో తామే మోనార్క్ అనుకుంటున్న టిఆర్‌ఎస్‌కు బిజెపి ప్రత్యామ్నాయం కావడంతో టిఆర్‌ఎస్‌కు మింగుడుపడడం లేదన్నారు. తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెపుతున్న మంత్రులు వారి ఆస్తులను అమ్మి అభివృద్ధి చేయడం లేదని, కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునిల్, పార్టీ రాష్ట్ర నాయకులు వంగాల సమ్మిరెడ్డి పాల్గొన్నారు.