వరంగల్

సార్ ఆశయసాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 21: ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. మంగళవారం వరంగల్ బాలసముద్రంలోని ఏకశిల పార్కులో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయాలను ఆధారాలతో సహా వివరించి ప్రజలను చైతన్యపరిచిన మహానుభావుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆవశ్యకతను గుర్తించి చివరివరకు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ఉద్యమ భావజ్వాల వ్యాప్తికి విశేష కృషి చేశారని అన్నారు. ఉద్యమ జ్వాలలు నిరంతరం సజీవంగా ఉంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారన్నారు. తెలంగాణ ఉద్యమనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట కడవరకు ఉండి తెలంగాణ ఏర్పడేందుకు దిశానిర్దేశం చేశారన్నారు. వారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర సహకారం కావడంలో క్రియాశీల పాత్ర పోషించిన వరంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ పేరు మీద ఏకశిల పార్కును జయశంకర్ స్మృతివనంగా 43.65 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాబోయే తరాలకు ఆచార్య జయశంకర్‌సార్ చరిత్ర తెలిసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆలోచన మేరకు స్మృతివనం, ఆడిటోరియం, మ్యూజియం, గ్రంథాలయ నిర్మాణం చేపడతామన్నారు. అంతకుముందు జయశంకర్‌సార్ విగ్రహానికి మేయర్ నరేందర్, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపిలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, శంకర్‌నాయక్, కార్పొరేటర్లు, టిఎన్‌జిఓలు, విద్యార్థి సంఘాల నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రేషన్ డీలర్ల మహా ధర్నా
నగరంలో భారీ ర్యాలీ * స్తంభించిన ట్రాఫిక్
వడ్డేపల్లి, జూన్ 21: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు - ప్రభుత్వానికి వారథిగా పనిచేస్తున్న రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వరంగల్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల రమేష్‌బాబు, చిలగాని మోహన్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిలేనిరాహారదీక్షలు చేపట్టిన రేషన్ డీలర్లు ఐదవ రోజైన మంగళవారం నాడు పబ్లిక్ గార్డెన్ నుండి అదాలత్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మొదటగా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు, ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కొంత సందిగ్దం తర్వాత భారీ బందోబస్తుతో ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టరేట్‌కు చేరుకున్న రేషన్ డీలర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ పోలీసులు అడ్డకోవడంతో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం డీలర్ల సంఘం నాయకులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా పంపిణీ పథకాన్ని ఎన్నో దశాబ్దాలుగా క్షేత్ర స్థాయిలో అమలు పరుస్తున్న రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోని డీలర్ల అందరికీ కనీస గౌరవ వేతనం 20 వేలు, తూకం వేసే వారికి ఆరు వేలు, దుకాణం నిర్వహణకు నాలుగు వేల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.