వరంగల్

మొక్కల పెంపకానికి పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసముద్రం, జూన్ 28: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో, ఆస్పత్రులలో మొక్కల పెంపకానికి పూర్తి సహకారం అందిస్తామని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ భవన్‌లో జరిగిన హరితహారం ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలకు, ఆస్పత్రులకు సంబంధించి మొక్కల రవాణాకు ట్రాక్టర్లు, నేలచదునుకు ప్రొక్లైనర్ల వంటి వాటిని పంపడానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. కానీ సంబంధితులు రూట్‌మ్యాప్‌తో పాటు పూర్తి వివరాలతో కార్పొరేషన్‌లో సంప్రదించాలన్నారు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ తాము తీసుకున్న ఉద్యోగ బాధ్యతలో మొక్కల పెంపకాన్ని తప్పనిసరిగా భావించాలని, అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. తక్కువ మొక్కలకు ఇండెంట్ ఇచ్చిన వాటి సంరక్షణ పెంపకం ముఖ్యమన్నారు. రాబోయే తరానికి మంచి వాతావరణ పరిస్థితులు కల్పించడానికి మొక్కల పెంపకం తప్పనిసరి అన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు తమకు కావలసిన మొక్కల పూర్తి వివరాలతో కూడిన ఇండెంట్‌ను సామాజిక వన విభాగం అటవీశాఖ అధికారికి సత్వరమే ఇవ్వాలని వారు యూనివర్సిటీలో పెంచుతున్న నర్సరీ నుండి మొక్కలు పంపిణీ చేస్తారన్నారు. ఒకే రోజున మొక్కలు నాటడానికి ముందస్తుగా చర్యలను తీసుకోవాలన్నారు. ఇండెంట్ ఇచ్చిన వారికి 24 గంటల్లో మొక్కలు సరఫరా చేయాలని డిఎఫ్‌ఓను ఆదేశించారు.