వరంగల్

అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు/ములుగుటౌన్, జూన్ 28: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అబ్బాపురంలో పశువులు, గొర్రెలకు గాలికుంటు టీకాలు వేశారు. గ్రామంలోని కొంతమంది లబ్ధిదారులకు వన, గిరిరాజా కోళ్లను సబ్సిడీపై అందజేశారు. అనంతరం ములుగు నుండి బుద్దారం మీదుగా వెల్తుర్లపల్లి వరకు రూ.15కోట్లతో చేపట్టనున్న డబుల్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆతదుపరి ములుగులోని ఆర్‌డి ఒ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. హరితహారం పథకంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు కావాల్సిన ఫెన్సింగ్, నీటి కోసం బోరు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని అన్నారు. రహదారుల వెంట నాటి ప్రతి మొక్కబతికే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సిఎం కెసిఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ సఫలీకృతం కావాలంటే ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ములుగులో ఇచ్చిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, షాదీముబారక్ పతకాన్ని ప్రతి నిరుపేద ముస్లిం కుటుంబం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డి ఒ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం ఐటిడి ఎపిఒ అమయ్‌కుమార్, తహశీల్దార్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.