వరంగల్

జిల్లా ఉద్యమం..ఉధృతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూలై 1: జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. ధర్నాలు, నిరసనలతో ఇన్నాళ్లు ఆందోళన చేసిన ఉద్యమకారుల ఆగ్రహం కట్టలు తెంచుకొని విధ్వంసానికి దారితీసింది. శుక్రవారం జిల్లా సాధన ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ పలు విధ్వంసాలతో విజయవంతమైంది. పట్టణ ప్రజలతో పాటు వివిధ మండలాలకు చెందిన వేలాది మంది స్థానిక ఆర్టీసి చౌరస్తా చేరుకొని ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో వల్ల హైదరాబాద్- వరంగల్ 163వ జాతీయ రహదారితో పాటు సిద్దిపేట- సూర్యాపేట రహదారుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యమకారులు చౌరస్తాలో రాస్తారోకో చేస్తుండగా కొంతమంది గుర్తు తెలియని ఆందోళనకారులు ఆర్టీసి బస్సుకు నిప్పంటించి దగ్ధం చేశారు. అలాగే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది పరుగులు తీస్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. వారు వెనుతిరిగి చౌరస్తా చేరుకునే క్రమంలో రహదారి పక్కన ఉన్న జనగామ పట్టణ సిఐ వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. అదే విధంగా దారిలో చిక్కుకున్న ఐదు ఆర్టీసి బస్సుల అద్దాలు, అలాగే మరో ఐదు ప్రయివేట్ వాహనాలపై రాళ్ల వర్షం కురిపించి విధ్వంసాన్ని సృష్టించారు. స్థానిక చౌరస్తాలో ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యమ నాయకులను డిఎస్పీ పద్మనాభరెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా ఉద్యమకారులంతా ఒక్కసారిగా నినాదాలు చేస్తూ పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేస్తుండగా నాయకులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్యమకారులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా వందలాది మంది మహిళలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాజీనామా చేసి ఉద్యమంలో కలిసిరావాలని నినాదాలు చేస్తూ స్థానిక చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. సిరిసిల్ల చిన్నది.. జనగామ పెద్దది..., యాదాద్రి వద్దు.. జనగామ ముద్దు... అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, ఎంపిపి బైరగోని యాదగిరి, పట్టణ, మండల కమిటీల అధ్యక్షులు యాదగిరిరెడ్డి, కళింగరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పట్టణంలోని ప్రధాన రోడ్లలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో జిల్లా సాధన ఐకాస చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, వైస్‌చైర్మన్ నాగారపు వెంకట్, కౌన్సిలర్లు ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనుతో పాటు నాయకులు జక్కుల వేణుమాధవ్, మంగళంపల్లి రాజు, ఆకుల సతీష్, రత్నాకర్‌రెడ్డి, సాదిక్ అలీ, పిట్టల సురేష్, అన్వర్, బైరు బాబు, పజ్జూరి గోపయ్య, జగదీష్, కెవిఎల్‌ఎన్‌రెడ్డిలు పాల్గొన్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని రహదారులపై నిలిచిపోయిన వాహనాలను పంపించేందుకు సుమారు గంటన్నర సమయం పట్టింది.